మెగా టోర్నీ ప్రపంచకప్ తర్వాత ప్రపంచదేశాలు టి20 వరల్డ్ కప్ కోసం సన్నద్ధమవుతున్నాయి. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. గత ప్రపంచకప్ లో భారత్ చేతిలో చిత్తు అయిన పాకిస్తాన్ టి20 ప్రపంచకప్ లో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. ఫైనల్ లో ఓటమిని భారత్ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. ఆ ప్రతీకారాన్ని ఇక్కడ తీర్చుకోవాలని రోహిత్ సేన గట్టిగా భావిస్తోంది. ఇక భారత్ – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే తల అయినా తెంచుకుంటాం కానీ ఓటమిని ఒప్పుకోమనే రీతిలో ఆటలో ఉద్రిక్తత, భావోద్వేగం కనిపిస్తుంది.
ఈ నేపథ్యంలో భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ దాదాపు ఖరారు అయింది. జూన్ 5వ తేదీన ఐర్లాండ్, జూన్ 9న పాకిస్తాన్, జూన్ 12న అమెరికా, జూన్ 15న కెనడా దేశాలతో టీమిండియా తలపడనుంది. జూన్ 9న పాకిస్తాన్ తో భారత్ తలపడనుండగా…. ఆ రోజు కోహ్లీకి స్పెషల్ డే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఐసీసీ విరాట్ కోహ్లీకి 2019 జూన్ 9న స్పిరిట్ ఆఫ్ క్రికెట్ 2019 అవార్డును అందజేసింది. దానికి కారణం 2019 ప్రపంచకప్ లో భాగంగా జూన్ 9వ తేదీన భారత్ – ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగింది. బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కున్న స్టీవ్ స్మిత్ మ్యాచ్ ఆడుతున్నాడు.
Advertisement
స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు చీటర్ చీటర్ అంటూ స్మిత్ ను దారుణంగా అవమానించారు. దీంతో కోహ్లీ కలగజేసుకొని ప్రేక్షకులను అలా చేయొద్దంటూ అనడంతో వారంతా ఆపేశారు. సరిగ్గా ఐదేళ్ల తర్వాత అదే రోజున భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచకప్ లో 20 జట్లు పోటీపడతాయి. కానీ మినీ ప్రపంచకప్ లో 20 జట్లు పోటీపడతాయి. ఐదు జట్లను ఒక్కో గ్రూప్ గా ఎంపిక చేసి అన్ని జట్లను నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. గ్రూపుల్లో నిలిచిన టాప్ రెండు జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత ఈ సూపర్-8 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. వాటిల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. సెమీస్ లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.