Home » IND VS AUS : ఓటమి ముంగిట ఇండియా.. రోహిత్ చేసిన ఈ 3 తప్పిదాలు ఇవే

IND VS AUS : ఓటమి ముంగిట ఇండియా.. రోహిత్ చేసిన ఈ 3 తప్పిదాలు ఇవే

by Bunty
Ad

 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియా దారుణంగా విఫలమైంది. తాము బిగించిన స్పిన్ ఉచ్చులోనే పడి గిలగిలలాడిన టీమిండియా ఓటమి ముంగిట నిలిచింది. అయితే రోహిత్ నిర్ణయాల వల్లే ఇండియా ఓటమి ముంగిట ఉందని ప్రచారం జరుగుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. రెండోరోజు తొలి సెషన్ లో బౌలింగ్ లో సత్తాచాటిన టీమిండియా బ్యాటింగ్ లో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయింది.

READ ALSO : టిడిపి బిగ్ స్కెచ్.. మంత్రి రోజాపై పోటీకి అలేఖ్య రెడ్డి రెడీ ?

Advertisement

గింగిరాలు తిరుగుతున్న పిచ్ పై నిలబడలేకపోయింది. బ్యాటింగ్ వైఫల్యానికి తోడు కెప్టెన్ గా రోహిత్ శర్మ చేసిన వ్యూహాత్మక తప్పిదాలు టీమిండియా కొంపముంచాయి. రెండో రోజు ఆట ప్రారంభంలో రోహిత్, రవిచంద్రన్ అశ్విన్ కు ఆలస్యంగా బౌలింగ్ ఇచ్చి గోర తప్పిదం చేశాడు. ఈ సిరీస్ లో తొలి రెండు టెస్టుల్లో అద్భుత బ్యాటింగ్ తో విలువైన పరుగులు చేసిన అక్షర పటేల్ ను బ్యాటింగ్ లో ప్రమోట్ చేయకుండా ఎనిమిదవ స్థానంలో పంపించి టీం మేనేజ్మెంట్ మూల్యం చెల్లించుకుంది.

Advertisement

READ ALSO : ఉప్పెన సినిమా కథను.. వినకుండానే రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

కేఎస్ భరత్ స్థానంలో బ్యాటింగ్ పంపించి ఉంటే ఒంటరి పోరాటం చేస్తున్న పుజారాకు అండగా నిలిచేవాడు. ఇక బ్యాటర్లంతా విఫలమైన వేళ చతేశ్వర్ పుజారా తన శైలిలో నిదానంగా ఆడుతూ ఉంటే అనవసర స్ట్రాటజీతో రోహిత్ డిస్టర్బ్ చేశాడు. ‘మేసే గాడిదను కూసే గాడిద వచ్చి చెడగొట్టినట్లు’ దాటిగా ఆడాలని ఇషాన్ తో సందేశం పంపించి వారిని డిస్టర్బ్ చేశాడు. అటాకింగ్ గేమ్ ఆడాలని రోహిత్ చెప్పడంతో అప్పటివరకు నిదానంగా ఆడిన పుజారా తన శైలికి భిన్నంగా భారీ సిక్సర్ కొట్టాడు. కానీ ఆ వెంటనే లయన్ బౌలింగ్ లో స్మిత్ సూపర్ క్యాచ్ కు వెనుదిరిగాడు. పుజరా అవుట్ అయిన కొద్దిసేపటికి టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది.

read also : చైనాలో 40 కోట్లకు పైగా పెళ్లి కాని ప్రసాద్ లు… కారణం ఇదే!

Visitors Are Also Reading