Home » పెరిగిన ఎండ‌ల తీవ్ర‌త‌.. పాఠ‌శాల‌ల స‌మ‌యం కుదింపు ..!

పెరిగిన ఎండ‌ల తీవ్ర‌త‌.. పాఠ‌శాల‌ల స‌మ‌యం కుదింపు ..!

by Anji
Ad

తెలంగాణ‌లో మార్చిలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. రాష్ట్రంలోనే అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో న‌మోద‌య్యాయి. కొమురం భీం జిల్లా కెర‌మొరిలో ఇవాళ అత్య‌ధికంగా 43.9, కౌటాల‌లో 43.7 చెప్పాల్లో 43.8 డిగ్రీలు న‌మోదు అయింది. జైనాథ్ 43.8 డిగ్రీలు న‌మోద‌వ్వ‌డంతో ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఎండ‌ల తీవ్ర‌త నేప‌థ్యంలో పాఠ‌శాల‌ల స‌మ‌యం కుదించాల‌ని సీఎస్ సోమేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Advertisement

ఆదేశాల మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్లు వైద్యారో్య శాఖ‌, డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. రెండు రోజుల్లో ఉత్త‌ర తెలంగాణ జిల్లాల‌తో పాటు న‌ల్ల‌గొండ, సూర్య‌పేట‌, నిజామాబాద్ త‌దిత‌ర జిల్లాల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు పెరిగే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.

ఉపాధి హామీ కూలీలు ఎండ‌లో ప‌ని చేయ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. అగ్ని ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం ఉన్నందున అగ్ని మాప‌క శాఖ‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని సూచించారు సీఎస్‌. సోమేష్ కుమార్‌. ఇక రేప‌టి నుంచి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు ఉద‌యం 8 గంట‌ల నుంచి 11.30 వ‌ర‌కు మాత్ర‌మే ప‌ని చేస్తాయ‌ని.. ఆ స‌మ‌యం ఏప్రిల్ 06వ తేదీ వ‌ర‌కు అమ‌లులో ఉంటుంద‌ని తెలంగాణ స్కూల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్ ప్ర‌క‌టించారు.

Visitors Are Also Reading