Home » Income Tax Raid : ఇన్ కమ్ టాక్స్ రైడ్స్ ఎలా చేస్తారు ? రైడ్ లో దొరికిన డబ్బును ఏం చేస్తారో తెలుసా ?

Income Tax Raid : ఇన్ కమ్ టాక్స్ రైడ్స్ ఎలా చేస్తారు ? రైడ్ లో దొరికిన డబ్బును ఏం చేస్తారో తెలుసా ?

by Bunty
Ad

ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఒకే వార్త ఇన్ కమ్‌ టాక్స్ రైడ్స్. న్యూస్‌ ఛానెల్‌ పెడితే చాలు.. ఇన్ కమ్‌ టాక్స్ రైడ్స్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య టీఆర్‌ఎస్‌ నేతలు, అటు వైసీపీ నేతల ఇండ్లల్లో ఇన్ కమ్‌ టాక్స్ రైడ్స్ చోటు చేసుకుంఉటన్నాయి. అంతేకాదు ఈ రైడ్స్‌ లో భారీగా డబ్బు పట్టుబడినట్లు నిత్యం అనేక వార్తలు వస్తుంటాయి. సోషల్ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. మరి ఇన్ కమ్ టాక్స్ రైడ్స్ ఎలా చేస్తారు ? స్వాధీనం చేసుకున్న డబ్బును ఏం చేస్తారు అనే ప్రశ్నలు అందరికీ వస్తాయి. అయితే.. దీనిపై ఇవాళ క్లారిటీ గా తెలుసుకుందాం.

read also : Sanju Samson : టీమిండియాలో ఛాన్సులు రాక ఐర్లాండ్ కు ఆడనున్న సంజూ !

Advertisement

 

అసలు సెర్చ్ ఆపరేట్ ఎలా చేస్తారు.

సంపద విషయంలో అనుమానస్పదంగా ఉన్న వారిని గుర్తించి దారులు చేస్తారు. ఎవరు రైడ్ కు వెళ్లాలి అనేది నిర్ణయించుకోవడం జరుగుతుంది. సీనియర్ అధికారి నేతృత్వంలో సెర్చ్ వారెంట్ జారీ చేయడం జరుగుతుంది. అలా సెర్చ్ ఆపరేషన్ టీం ఏర్పాటు అవుతుంది. ఆ టీం లక్షిత వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహిస్తుంది. అయితే లక్షత వ్యక్తి వివరాలు, సోదాలు ఎక్కడ చేయాలి వంటి వివరాలన్నింటినీ చాలా గోప్యంగా ఉంచుతారు. సీల్డ్ కవర్ లో వివరాలను పొందుపరుస్తారు. చివరి క్షణంలో ఆ వివరాలు తెలుసుకొని దాడులు చేయడం జరుగుతుంది.

Advertisement

జప్తు ఎలా?

రైడ్ చేసిన వ్యక్తి నుంచి వస్తువులను జప్తు చేయడానికి కూడా చాలా నియమాలు ఉన్నాయి. కంప్యూటర్లు, సిస్టం లోని హార్డ్ డిస్క్ తదితరాలను స్వాధీనం చేసుకుంటారు. అక్రమంగా లెక్కలు చెప్పని ఆస్తులు, నగదు నగలు అన్నింటిని జప్తు చేస్తారు. జప్తు చేసిన వాటి వివరాలను నమోదు చేసి, సంబంధిత వ్యక్తి అందజేస్తారు. వారి నుంచి ధ్రువీకరణ తీసుకుంటారు. సెర్చ్ ఆపరేషన్ తర్వాత స్టేట్మెంట్స్ కూడా తీసుకుంటారు.

స్వాధీనం చేసుకున్న డబ్బును ఏం చేస్తారు

జప్తు చేసిన ఆస్తిని ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏం చేస్తారనే ప్రశ్న అందరినీ వేధిస్తుంది. అయితే అధికారులు జప్తు చేసిన సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఇందులో కమిషనర్ కు లింక్ చేసిన అకౌంట్స్ ఉంటాయి. అకౌంట్స్ లో సీజ్ చేసిన సొమ్మును డిపాజిట్ చేస్తారు. ఆ తర్వాత మొత్తం ఆస్తి, ఆదాయం వివరాలను చెక్ చేస్తారు. ప్రభుత్వానికి రావాల్సిన టాక్స్ ఎంత వంటి వివరాలను నిర్ధారించుకుంటారు. టాక్స్ డబ్బులు మినహా మిగతా సొమ్మును తిరిగి వారికి చెల్లిస్తారు.

READ ALSO : NRI లను పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డ 6 మంది టాలీవుడ్ హీరోయిన్లు వీళ్లే

Visitors Are Also Reading