Home » షూటింగ్ లో ఎన్టీఆర్ ఆ పని అస్సలు చేయాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శేఖర్ మాస్టర్..!!

షూటింగ్ లో ఎన్టీఆర్ ఆ పని అస్సలు చేయాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శేఖర్ మాస్టర్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఇక టాలీవుడ్ లో అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా వచ్చిన ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలు నటించారు. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. వీరిద్దరూ నటన పరంగా ప్రేక్షకులతో విజిల్స్ వేయించుకున్నారు. ఇక ఈ పాత్రల్లో వీళ్ళ హీరోయిజాన్ని చూపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ సినిమాగా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్ లో భారీ స్థాయిలో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు.

ఇదిలా ఉండగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరు బెస్ట్ డాన్సర్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు ఎన్టీఆర్. ఈయన బొద్దుగా ఉన్న, సన్నగా ఉన్న ముందు నుంచి డ్యాన్స్ మాత్రం ఇరగదీస్తాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈయన డ్యాన్స్ అంటే హీరోయిన్స్ కి మాత్రమే కాదు, కొరియోగ్రాఫర్స్ కి సైతం జ్వరం వచ్చేస్తుంది. ఏ డ్యాన్సర్ అయిన రిహార్సల్స్ లేకుండా డాన్స్ చేయడానికి తడబడతారు.కానీ ఎన్టీఆర్ మాత్రం ఎంత కష్టమైన స్టెప్ అయినా సరే రిహార్సల్స్ కూడా చేయరట. ఈ విషయాన్ని స్వయంగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టరే చెప్పారు. మన స్టార్స్ లో తక్కువ రిహార్సల్స్ చేసేది ఎవరు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. వెంటనే శేఖర్ మాస్టర్ ఎన్టీఆర్ పేరు చెప్పేశారు. ఎన్టీఆర్ అసలు రిహర్సల్స్ కే రారని, డైరెక్ట్ గా చూసి చేసేస్తారని మాస్టర్ చెప్పారు.

 

 

 

దీంతో ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్ అని మరోసారి అర్థమైపోయింది. తారక్ తన కెరీర్లో ఇప్పటి వరకు చేసిన సినిమాలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. తన డ్యాన్స్ విషయంలో ప్రతి ఒక్కరు చెప్పినట్లే ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా చెప్పారు. ఇంకా హైలెట్ పాయింట్ ఏంటంటే.. అసలు రిహార్సల్స్ కి రారని, డాన్స్ పర్ఫార్మెన్స్ జరిగేటప్పుడు చూసి,ఎప్పుడు ట్రై చేస్తారో కూడా తెలియదని, సడన్ గా వచ్చి ఆయన డాన్స్ ఆయన చేసి వెళ్ళిపోతాడంటూ అద్భుతమైన విషయాలను తెలియజేశారు శేఖర్ మాస్టర్.

ALSO READ;

దేవి నాగ‌వల్లితో లొల్లి హీరోల‌కు క‌లిసివ‌స్తుందా..? నెట్టింట ట్రోల్స్..!

దేవి నాగ‌వల్లితో లొల్లి హీరోల‌కు క‌లిసివ‌స్తుందా..? నెట్టింట ట్రోల్స్..!

 

Visitors Are Also Reading