Home » ఎలక్ట్రికల్ వాహనాల్లో మంటలు చెలరేగితే..నీరు చల్లొద్దు.. ఏం చేయాలంటే..!!

ఎలక్ట్రికల్ వాహనాల్లో మంటలు చెలరేగితే..నీరు చల్లొద్దు.. ఏం చేయాలంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగితే అదుపులోకి తెచ్చేందుకు ఎట్టి పరిస్థితుల్లో నీటిని వినియోగించొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈవి బ్యాటరీల్లో ఉండే సెల్ లో నిండి ఉండే పదార్థాల కారణంగా నీరు చల్లినప్పుడు రసాయన చర్య జరిగి ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

సాధారణంగా విద్యుత్ కార్లు, ద్విచక్ర వాహనాలు లిథియం అయాన్ బ్యాటరీలతో నడుస్తాయి. సెల్స్ తయారీ, ప్యాకింగ్ లో లోపం ఉంటే వేడెక్కి మంటలు వ్యాపించే అవకాశం ఉంది. అంతర్గతంగా జరిగే రసాయన చర్య తో బ్యాటరీ లోపల ఆర్గానిక్ ద్రవరూప ఎలక్ట్రో లైట్లు మంటలు మరింత పెరిగేందుకు కారణమవుతాయి.ఈ సమయంలో నీరు పోస్తే హైడ్రోజన్ వాయువు, లిథియం హైడ్రోక్సైడ్ ఉత్పత్తవుతుంది.

Advertisement

హైడ్రోజన్ వాయువు మండే స్వభావం ఉండడంతో ఒక్కసారి పేలిపోతుంది లేదా మంట తీవ్రత మరింత పెరుగుతుంది. ఈ మంటలను నియంత్రించేందుకు ఏబీసీ పౌడర్ మాత్రమే చల్లాలని ఎలక్ట్రిక్ వాహన రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఏబిసి పొడి, వాహనం లేదా బ్యాటరీ పైభాగంలో చల్లినప్పుడు ఒక పొరలాగా ఏర్పడుతుంది. దీని వల్ల ఒక్కసారిగా మంటలు అదుపు లోనికి రాకున్నా మంట మరింత పెరగకుండా ఉంటాయి.

also read;

భారీ ప్రక్షాళన దిశగా కాంగ్రెస్.. ఒక కుటుంబంలో ఒకరికి టికెట్..!!

చనిపోయిన పది రోజుల్లోపు కర్మకాండ చేయకుంటే వారి ఆత్మలు చెట్లపైన ఉంటాయా..!!

 

Visitors Are Also Reading