Telugu News » Blog » Ananta Sriram : వివాదంలో ఇరుక్కున్న అనంత్ శ్రీరామ్, ఆ కులస్తులను అవమానించారని..

Ananta Sriram : వివాదంలో ఇరుక్కున్న అనంత్ శ్రీరామ్, ఆ కులస్తులను అవమానించారని..

by Bunty
Ads

తెలుగు చిత్ర పరిశ్రమలో గేయరచయితగా మంచి గుర్తింపు పొందిన వారిలో అనంత్ శ్రీరామ్ ఒకరు. ఆయన చూడటానికి ఎంత సౌమ్యంగా కనిపిస్తాడో, ఆయన రాసే పాటలు కూడా అంతే సౌమ్యంగా ఉంటాయి. అయితే ఎల్లప్పుడూ సాఫ్టుగా కనిపిస్తూ, చక్కగా మాటలతో మెప్పించే అనంత్ శ్రీరామ్ ఇటీవల ఎవరు ఊహించని విధంగా కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.

Advertisement

ఇది ఎలా ఉండగా, సినీ రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనంత్ శ్రీరామ్ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. అనంత్ చేసిన వాక్యాలపై ఇప్పుడు భట్రాజు కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంత్ శ్రీరామ్ పై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు భట్రాజు కులస్తులు. ఇంతకు ఏం జరిగిందంటే, పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పొగడ్తలు అంటూ తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని భట్రాజు కులస్తులు ఫిర్యాదు చేశారు.

Advertisement

భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించిందని అయినా కూడా ఇంకా తమ కులం పై వాక్యాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అనంత్ శ్రీరామ్ కు వివాదాలు కొత్తేమీ కాదు, గతంలోనూ ఒక పాట విషయంలో దేవతలను విమర్శించేలా రాశారని ఆయనపై అభ్యంతరం వ్యక్తం చేశారు కొందరు. తాజాగా భట్రాజు కులస్తులు అనంతరం స్టేజ్ పై చేసిన వ్యాఖ్యల వీడియోలను జత చేసి ఫిర్యాదు చేశారు. పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో భట్రాజు పొగడ్తలు అంటూ కామెంట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

READ ALSO : Mission Majnu Review : స్పై థ్రిల్లర్ ‘మిషన్ మజ్ను’ రివ్యూ