Home » వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తితో పాటు.. మధుమేహం కూడా అదుపులో ఉంటుంది..!

వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తితో పాటు.. మధుమేహం కూడా అదుపులో ఉంటుంది..!

by Anji
Ad

ప్రస్తుతం బిజీ బీజీ లైఫ్ లో చాలా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే వారు సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. తీర ప్రాణం మీదికి వచ్చిన తరువాత ఆసుపత్రుల్లో లక్షలకు లక్షలు డబ్బులు చెల్లించి తమ రోగాన్ని నయం చేసుకుంటుంటారు. కానీ వాస్తవానికి ఏ రోగం దరిచేరకుండా హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉండవచ్చు. వాటిలో ముఖ్యమైనవి డ్రై ప్రూట్స్. వీటి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి వాల్ నట్స్. రోజూ తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతంగా ఉండవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాల వంటివి పుష్కలంగా ఉన్నటువంటి వాల్ నట్స్ జ్ఞాపకశక్తికి చాలా మంచివని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

Advertisement

వాల్ నట్స్ లో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి  ఎన్నో పోషకాలుంటాయి. ఇలా పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో వాల్ నట్స్ ని డ్రై ప్రూట్స్ రారాజు అని పిలుస్తుంటారు. రెండు వాల్ నట్స్ ని రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తినడంతో ఎన్నో ప్రయోజనాలుంటాయి. వాల్ నట్స్ ని అక్రోట్ అని కూడా పిలుస్తారు. ఈ వాల్ నట్స్ తో మధుమేహాన్ని కూడా నియంత్రించవచ్చు. అదేవిధంగా జీర్ణశక్తికి, ఎముకలు గట్టి పడడంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా వాల్ నట్స్ చాలా మంచివి. ఈ వాల్ నట్స్ తో ఇంకా ఏమేమి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :  దీపారాధన చేసేటప్పుడు వత్తి ఏ వైపు ఉండాలో తెలుసా ?

Advertisement

Manam News

కరోనా సమయంలో డ్రైప్రూట్స్ కి విపరీతమైన డిమాండ్ పెరిగిన విషయం విధితమే. అసలు డ్రై ప్రూట్స్ అలవాటు లేని వారు కూడా కోవిడ్ వాటిని తినడం అలవాటు చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా డ్రైప్రూట్స్ రోగనిరోధక శక్తిని పెంచే శక్తి ఉండటమే ప్రధాన కారణం. వాల్ నట్స్ లో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండడంతో వ్యక్తిలోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పలు వ్యాధుల నుంచి వాల్ నట్స్ రక్షణ కల్పిస్తాయి. ఆరోగ్యంగా,  దృఢంగా ఉండడానికి నానబెట్టిన వాల్ నట్స్ ని తీసుకోవడం అలవాటు చేసుకోవడం ఉత్తమం. మలబద్ధకాన్ని కూడా నివారిస్తాయి. 

Also Read :  వాకింగ్‌ చేస్తే కూడా నష్టాలు ఉన్నాయి..బాగా నడిస్తే, ప్రమాదంలో పడ్డట్టే !

Manam News

 

షుగర్ ఉన్న వారు కూడా నానబెట్టిన వాల్ నట్స్ తినడం వల్ల చాలా ప్రయోజనం చేకూరుతుంది. వాల్ నట్స్ ని రోజు తినే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. వాల్ నట్ లు రక్తంలో చక్కరను అదుపులో ఉంచుతాయి. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే లక్షణాలు వాల్ నట్స్ లో ఉంటాయి. అధిక రక్తపోటు ఉన్నవారికి వాల్ నట్స్ ప్రయోజనకరంగా ఉంటాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతాయి.  ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడుతాయి. 

Also Read :  రాత్రి వేళలో భోజనం విషయంలో ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీరు డేంజర్ లో పడినట్టే.. జాగ్రత్త..!

Visitors Are Also Reading