Home » 2022లో IMDB రేటింగ్ ప్ర‌కారం టాప్ లో నిలిచిన 4 తెలుగు సినిమాలు ఇవే..!

2022లో IMDB రేటింగ్ ప్ర‌కారం టాప్ లో నిలిచిన 4 తెలుగు సినిమాలు ఇవే..!

by AJAY
Ad

2022 సంవత్సరం మరి కొద్ది రోజుల్లో ముగియనుంది. కాగా తాజాగా ఐఎండిబీ ఈ ఏడాది అత్యధిక రేటింగ్ వచ్చిన సినిమాల లిస్టును ప్రకటించింది. అంతేకాకుండా అన్ని భాషల్లో టాప్ రేటింగ్ వచ్చిన సినిమాల లిస్ట్ ను సైతం విడుద‌ల‌ చేసింది. ఆ లిస్ట్ ప్ర‌కారంగా తెలుగులో ఐఎండీబీ రేటింగ్ ప్రకారం టాప్ లో నిలిచిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం… దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ప్రేమకావ్యం సీతారామం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.

Advertisement

తెలుగులో ఈ సినిమా ఐఎండీబీ రేటింగ్ లో నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది. ఈ సినిమాకు ఐఎండీబీ లో 8.6 రేటింగ్ వ‌చ్చింది. అంతేకాకుండా అడవి శేషు హీరోగా నటించిన మేజర్ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ 8.4 వ‌చ్చింది. ఈ సినిమా సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుదలైన సంగతి తెలిసిందే.

Advertisement

RRR

అంతే కాకుండా ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా కు ఐఎండిబి రేటింగ్ ప్రకారం 8 రేటింగ్ వచ్చింది. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

Karthikeya 2

Karthikeya 2

అంతేకాకుండా నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ- 2 సినిమాకు ఐఎండిబి లో 7.9 రేటింగ్ వచ్చింది. ఈ సినిమా సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు కంటే బాలీవుడ్ లో ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.

దాంతోపాటు నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమాకు ఐఎండిబి ప్రకారం 7.6 రేటింగ్ వ‌చ్చింది. ఈ సినిమా లవ్ అండ్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా సైతం ఐఎండిబి రేటింగ్ లో నిలిచింది. ఈ సినిమాకు ఐఎండీబీలో 7.4 రేటింగ్ వచ్చింది.

ALSO READ : బాహుబలి 2 లో అనుష్క పక్కన నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

Visitors Are Also Reading