Home » మళ్లీ డ్యూటీ ఎక్కబోతున్న గోవా బ్యూటీ..ఆ హీరోతో ఛాన్స్..!

మళ్లీ డ్యూటీ ఎక్కబోతున్న గోవా బ్యూటీ..ఆ హీరోతో ఛాన్స్..!

by AJAY
Ad

రామ్ హీరోగా తెరకెక్కిన దేవదాస్ సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ సూపర్ హిట్ అందుకుంది. ఆ తరవాత వరుస సినిమాలు చేసిన ముద్దుగుమ్మ మళ్లీ పోకిరి సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా తరవాత ఇలియానా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. జులాయి, జల్సా సినిమాలతో ఇల్లి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

raviteja

raviteja

అయితే టాలీవుడ్ లో అవకాశాలు ఉన్న సమయంలోనే బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. కానీ ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. సీనియర్ హీరోల పక్కన ఆఫర్లు వచ్చినా నో చెబుతూ వస్తోంది. అయితే ఇలియానా కు ఇపుడు మరో మంచి అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. రవితేజ హీరోగా రామా రావు ఆన్ డ్యూటీ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Advertisement

Ileana

Ileana

అయితే ఈ సినిమాలో ఐటం సాంగ్ కోసం రవితేజ ఇలియానా అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారట. అంతే కాకుండా వీరిద్దరి కాంబో లో 4సినిమాలు వచ్చాయి. దాంతో ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ తో రవితేజ ఇలియానా కు ఛాన్స్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు టాక్.

Visitors Are Also Reading