Home » ఆ హీరోయిన్ సోద‌రుడితో ఇలియానా డేటింగ్‌ వాస్త‌వ‌మే..!

ఆ హీరోయిన్ సోద‌రుడితో ఇలియానా డేటింగ్‌ వాస్త‌వ‌మే..!

by Anji
Ad

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆమె అందంతో పాటు స‌న్న‌ని న‌డుముతో కుర్రాళ్ల మ‌తి పోగొట్టే ఈ ముద్దుగుమ్మ ఇలియానా. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ఈ బామ్మ‌. ప్ర‌స్తుతం ఆఫ‌ర్స్ లేక ఖాళీగా ఉంది ఈ బామ్మ‌. గ‌తంలో ప్ర‌ముఖ ఆస్ట్రేలియ‌న్ ఫోటో గ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ చేయడంపై బాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది ఈ బ్యూటీ. ఆ ల‌వ్ వ‌ల్ల డిప్రెష‌న్‌కి వెళ్లింది. దాని నుంచి బ‌య‌ట‌ప‌డిన త‌రువాత ఎట్ట‌కేల‌కు ఇప్పుడు ఇలియానాకు మ‌ళ్లీ ప్రేమ దొరికింది.

Advertisement

ఎవ‌రితోనే కాదండోయ్‌.. క‌త్రిన సోదరుడితోనే జ‌త కుదుర్చుకుంది. క‌త్రీనా కైఫ్ సోద‌రుడు సెబాస్టియ‌న్‌తో ఇలియానా సాన్నిహిత్యం గ‌త కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. జులై 16న జ‌రిగిన క‌త్రిన పుట్టిన రోజు వేడుక‌లో క‌త్రినా త‌న భ‌ర్త న‌టుడు విక్కీ కౌశ‌ల్‌, ఇలియానా బృందం మాల్దీవుల్లో సెబాస్టియ‌న్‌తో క‌లిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఇక క‌త్రినా సోద‌రుడు, మోడ‌ల్ సెబాస్టియ‌న్‌తో ఇలియానా స‌న్నిహితంగా మెలుగుతోంద‌ని దీనివ‌ల్ల‌నే ఇద్ద‌రూ న‌టీమ‌ణులు ద‌గ్గ‌రై అది స్నేహానికి దారి తీసింద‌ని ముంబై మీడియా ప‌లు క‌థ‌నాలు రాసింది. ప్ర‌ముఖ జాతీయ మీడియా క‌థ‌నం ప్ర‌కారం.. దాదాపు ఆరు నెల‌లుగా రిలేష‌న్ షిప్‌ని కొన‌సాగిస్తున్న ఈ జంట మీడియాకి చిక్కకుండా దాక్కుంటుంది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  ఒక్క‌డు సినిమాలో మ‌హేశ్ బాబు చెల్లెలు ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..?

ఇక ఇలియానా-సెబాస్టియ‌న్ క‌త్రినా ఇంట్లో లేదా ఇలియానా నివాసంలో ఒక‌రితో ఒక‌రు త‌మ విలువైన స‌మ‌యాన్ని గ‌డుపుతున్నార‌ని ప‌లు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ముంబై మీడియా క‌థ‌నాలు నిజ‌మే అయితే ఈ జంట త్వ‌ర‌లో ఓ ఇంటివాళ్ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం కాఫీ విత్ క‌ర‌ణ్ 7వ సీజన్ లో తార‌ల ర‌హ‌స్యాల‌ను లీక్ చేస్తున్న క‌ర‌ణ్. ఇలియానా-సెబాస్టియ‌న్ జంట ర‌హ‌స్యాన్ని కూడా లీక్ చేశారు. సెబాస్టియ‌న్ జీవితానికి సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఇలియానా కొత్త ల‌వ్ క‌న్ఫామ్ అయింది. ఇలియానా చివ‌రిసారిగా ద‌ర్శ‌కుడు కూకీ గులాటీ ది బిగ్‌బుల్‌లో అభిషేక్ బ‌చ్చ‌న్ స‌ర‌స‌న క‌న‌పించింది. త‌దుప‌రి రెండు చిత్రాల్లో కూడా న‌టించింది.

ఇది కూడా చ‌ద‌వండి :  ఈ ఫోటోలో ఉన్న బాబు ఓ స్టార్ హీరో.. ఎవ‌రో గుర్తు ప‌ట్టండి చూద్దాం..!

Visitors Are Also Reading