Home » ద‌ళ‌ప‌తి విజ‌య్-వంశీ పైడిప‌ల్లి సినిమా షురూ..!

ద‌ళ‌ప‌తి విజ‌య్-వంశీ పైడిప‌ల్లి సినిమా షురూ..!

by Anji
Ad

వంశీ పైడిప‌ల్లి – ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ కాంబినేష‌న్‌లో రాబోయే చిత్రం గురించి తెగ చ‌ర్చించుకుంటున్నారు. భారీ అంచ‌నాల నేప‌థ్యంలో ఈరోజు చెన్నైలో న‌టీన‌టులు సిబ్బందితో పూజా కార్య‌క్ర‌మాల్లో ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు విజ‌య్‌, ర‌ష్మిక పోషిస్తున్నారు. ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో సినిమా అంటే ర‌ష్మిక క‌ళ్ల‌ల్లో ఎంతో ఆనందం క‌నిపించింది. విజ‌య్ కు ర‌ష్మిక దిష్టి కూడా తీయడం విశేషం.

Advertisement

ఏప్రిల్ 06న చెన్నైలో విజ‌య్‌-66వ సినిమా పూజా కార్య‌క్ర‌మం జ‌రిగింది. పూజాకార్య‌క్ర‌మం నుంచి టీమ్ మొత్తం న‌వ్వుల‌తూ పోజులు ఇచ్చిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. విజ‌య్ బ్లూ ష‌ర్ట్‌లో క‌నిపించ‌గా.. ర‌ష్మిక లేత ఆకుప‌చ్చ లెహంగాలో చాలా అందంగా క‌నిపించింది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

Also Read :  మెగాస్టార్ గాడ్ ఫాద‌ర్ విడుద‌ల తేదీ ఖ‌రారు.. మూడు సినిమాలు పోటీ..!

Advertisement

ఏప్రిల్ 05 ర‌ష్మిక పుట్టిన రోజు సంద‌ర్భంగా ద‌ళ‌ప‌తి 66 నిర్మాత‌లు ఆమె ఈ సినిమాలో న‌టించ‌బోతోందంటూ అధికారిక ప్ర‌క‌ట‌న చేసారు. ఆమె లాంచ్ వేడుక‌కు హాజ‌రు కావ‌డానికి చెన్నైకి వెళ్లింది. ఈనెల‌లో షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి తెలుగు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ‌వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ దీనిని నిర్మిస్తున్నారు. న‌టీన‌టులు, సిబ్బందికి సంబంధించిన మ‌రిన్నీ వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌బ‌డ‌తాయి. విజ‌య్‌-నెల్స‌న్ దిలీప్‌కుమార్ కాంబోలో బీస్ట్ విడుద‌ల కోసం అంద‌రూ ఎదురు చూస్తున్నారు. పూజా హెగ్దే క‌థానాయికగా న‌టించ‌గా.. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించారు. ఏప్రిల్ 13న బీస్ట్ విడుద‌ల‌వ్వ‌నుంది.

Also Read :  రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ గురించి త‌మ్మారెడ్డి ఏమ‌న్నారో తెలుసా..?

Visitors Are Also Reading