పిల్లల వయస్సుని బట్టి ఎత్తు పెరగకపోతే శారీరక, మానసిక ఎదుగుదలతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. న్యూట్రిషియన్స్ ఉన్నప్పటికీ డైట్ ఇస్తే ఎత్తు బాగా పెరుగుతుంది. బిడ్డ పుట్టిన 6 నెలల తరువాత ఆహారం ఇవ్వవచ్చు. ప్రారంభంలో ఘన ఆహారాన్ని ఇవ్వలేరు కాబట్టి ఈ సమయం తరువాత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం చాలా ముఖ్యం.
Advertisement
పిల్లలు ఎత్తు పెరగకపోతే ఆకుపచ్చ కూరగాయలను జోడించండి. కూరగాయల ద్వారా వివిధ వంటకాలను తయారు చేసి ఆహారంగా ఇవ్వాలి. ఎత్తు పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. సాధారణంగా చాలా మంది పిల్లలు పండ్లు తినరు. ప్రతీ బిడ్డకు పండ్లు తినిపించాలి. చిన్న పిల్లలకు పండ్లు తినిపించే అలవాటు చేయడం ఉత్తమం. పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అదేవిధంగా మీ పిల్లల ఎత్తు తక్కువగా ఉంటే.. మీరు పండ్లు తప్పక తినిపించాలి.
పెరుగు :
పిల్లలకు కూరగాయలు, పండ్లతో పాటు పెరుగు కూడా తినిపించవచ్చు. పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే ప్రోబయోటిక్స్ అనేవి పెరుగులో ఉంటాయి. అదేవిధంగా పెరుగులో కాల్షియం, విటమిన్ డి ఉన్నాయి. ఇవి ఎముకలను బలవంతంగా తయారు చేయడానికి ఎత్తును పెంచడానికి ఉపయోగపడుతాయి.
Advertisement
సోయాబీన్ :
సోయాబీన్ లలో ప్రోటన్లు అధికంగా ఉంటాయి. పిల్లలకు ప్రోటిన్లు అధికంగా ఉండే ఫుడ్ చాలా అవసరం. క్రమం తప్పకుండా సోయాబీన్ తినిపించడం వల్ల కండరాలను వృద్ధి చేస్తాయి. ఎత్తు పెరగడానికి ఉపయోగపడుతాయి. సోయాబీన్స్ తినిపిస్తే పిల్లలకు శరీరంలో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ల లోపం తీరుతుంది.
Also Read : శుక్రవారం జన్మించిన వారికి ఈ రంగులు అదృష్టాన్ని కలిగిస్తాయనే విషయం మీకు తెలుసా ?
పాలు :
శిశువుకు అర్థమైనప్పటి నుంచి పాలు తాగడం అలవాటు చేసుకోవడం ఉత్తమం. పాలలో ఉండే కాల్షియం పిల్లలకు చాలా మంచిది. పిల్లలు ఎత్తు తక్కువగా ఉన్నట్టయితే ప్రతీరోజు ఉదయం, సాయంత్రం రెండు గ్లాస్ ల పాలు తాగించాలి. ఈ చిట్కాలను పాటిస్తే ఎత్తు పెరిగే అవకాశముంటుంది.