Home » వేసవిలోశరీరం చల్లగా ఉండాలంటే .. ఈ పొడిని పాలలో కలుపుకొని తాగండి..!!

వేసవిలోశరీరం చల్లగా ఉండాలంటే .. ఈ పొడిని పాలలో కలుపుకొని తాగండి..!!

by Sravanthi
Ad

వేసవికాలంలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎండ వేడిమి తట్టుకోవడానికి చల్లదనాన్ని ఇచ్చే జ్యూస్ లు, కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం. అలా తాగే వాటిలో వేసవికాలంలో ఎక్కువగా తాగేది సుగంధ పాలు. ఈ పాలను వేసవికాలంలోనే ఎక్కువగా తాగుతూ ఉంటారు. అసలు ఈ పాలు ఎందుకు తాగాలి..? తాగడం వల్ల ఏం లాభాలు ఉన్నాయో..? ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండియాలో సుగంధి మీద 2012లో రోలాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లో ఒరిస్సా వారు ఈ పరిశోధన సుగంధి మీద చేశారు. అయితే సుగంధి లో చేసిన పరిశోధన ప్రకారం దీనిలో 40 రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయట.

Advertisement

ఇది వేసవి కాలంలో ఎండ వల్ల శరీరంలో విడుదలయ్యే వేస్ట్ కెమికల్స్ అన్నింటిని వాటర్ సాల్యుబుల్ కెమికల్స్ గా మార్చి, కాలేయాన్ని యాక్టివేట్ చేసి యూరిన్ ద్వారా 80-90 శాతం బయటకు పోయేటట్లు సుగంధి చేయగలుగుతుందని స్పష్టం చేశారు. దీనితోపాటు శరీరంలో డీహైడ్రేషన్ ను తగ్గించి వాటిని హైడ్రేట్ చేసి చల్లదనాన్ని ఇచ్చే కొన్ని రసాయనాలు ఇందులో ప్రత్యేకంగా ఉండడంవల్ల వేసవి కాలంలో ఇది ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది.

Advertisement

ఈ రెండు ఫలితాలు సుగంధి లో రావడానికి ఇందులో ఉండే 40 రకాల యాంటీ ఆక్సిడెంట్లే కారణం. అందువల్ల వేసవికాలంలో సుగంధి పొడిని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఉండే పాలలో సుగంధి పొడిని కలుపుకుని తాగడం వల్ల చాలా మంచిది. బయట అమ్మే వాటిలో సహజమైన పొడిని వాడరు కాబట్టి వరిజినల్ సుగంధి పొడిని తీసుకొచ్చి ఇంట్లో స్వయంగా పాలలో కలిపి తాగడం వల్ల వేసవికాలంలో మంచి ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తుంది. అలాగే వేసవి కాలంలో శరీరంలో రిలీజ్ అయ్యే వేస్ట్ కెమికల్స్ ని బయటికి కూడా పంపించవచ్చు.

ALSO READ;

గ్రూప్‌-1 పోస్టుల కేటాయింపుపై మీకు డౌట్ ఉంటే ఈ విష‌యాలు తెలుసుకోండి..!

అయ్యో పాపం హైపర్ ఆదికి ఏమైంది.. ఇలా ఎందుకు చేశాడు..!!

 

Visitors Are Also Reading