Home » అమ్మాయిలు.. మీకు మంచి భ‌ర్త కావాలంటే ఈ రాశుల‌వారిని పెళ్లి చేసుకోండి..!

అమ్మాయిలు.. మీకు మంచి భ‌ర్త కావాలంటే ఈ రాశుల‌వారిని పెళ్లి చేసుకోండి..!

by Anji

ఈ రోజుల్లో చాలా మంది మంచి భ‌ర్త కోసం చాలా ఏళ్లు ఎదురు చూసి మ‌రి పెళ్లి చేసుకుంటున్నారు. నిత్యం వార్త‌ల్లో భార్య‌, భ‌ర్త‌ల గొడ‌వ‌లు, త‌దిత‌ర వింటూనే ఉంటాం. ప్ర‌ధానంగా మ‌హిళ‌లు పురుషుల్లో అందం కంటే వారి ధైర్య సాహ‌సాల‌ను చూసే ఎక్కువ‌గా ఆక‌ర్షితుల‌వుతారు. అలాంటి వారు తమ జీవితానికి భద్ర‌త‌గా నిలుస్తార‌ని భావిస్తుంటారు. అదేవిధంగా నిజాయితీగా వ్య‌వ‌హ‌రిస్తూ.. త‌మ కుటుంబం ప‌ట్ల బాధ్య‌త‌గా ఉంటార‌ని వారి అభిప్రాయం. ముఖ్యంగా మంచి ల‌క్ష‌ణాలు ఉన్న భ‌ర్త త‌మ జీవితంలోకి రావాల‌ని ప్ర‌తి స్త్రీ కోరుకుంటుంది. ఇక జ్యోతిష్యులు ఈ రాశుల‌కు చెందిన వారు ఉత్త‌మ భ‌ర్త‌లుగా నిలుస్తార‌ని చెబుతున్నారు. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

వృష‌భం :

 

Vrushabha rashi

Vrushabha rashi

 

ఈ రాశికి చెందిన పురుషులు చాలా న‌మ్మ‌క‌స్తులు. వీరు మీ ప‌ట్ల నిజాయితితో వ్య‌వ‌హ‌రిస్తారు. జీవిత భాగ‌స్వాముల‌తో స్థిర‌త్వం కోసం చూస్తారు. వృష‌భ రాశికి చెందిన వ్య‌క్తిని పెళ్లి చేసుకుంటే.. మిమ్మ‌ల్ని ఎప్ప‌టిక‌ప్పుడు సంతోషంగా ఉంచుతాడు. మీ అవ‌స‌రాల‌ను గుర్తించి.. వాటిని తీర్చేందుకు ప్ర‌య‌త్నిస్తాడు. మీ ప‌ట్ల అమిత‌మైన ప్రేమ చూపించి విధేయులుగా ఉంటారు.

మిథునం : 

Mithuna

Mithuna

మిథున రాశికి చెందిన పురుషులు త‌మ భార్య‌ల ప‌ట్ల అత్యంత గౌర‌వం, అంకిత భావం క‌లిగి ఉంటారు. వారు మిమ్మ‌ల్ని జీవితానికి భ‌ద్ర‌త‌గా నిలుపుతారు. వారు మీ ప‌ట్ల చూపించే ప్రేమ‌తో మీరు ముగ్ధుల‌వుతారు. కొన్ని సంద‌ర్భాల్లో చిన్న చిన్న గొడ‌వలు, మ‌నస్ప‌ర్థాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. వారే ముందు చొర‌వ తీసుకుని మీతో సంభాషిస్తారు.

క‌ర్కాట‌కం :

Karkataka

Karkataka

క‌ర్కాట‌క రాశికి చెందిన పురుషులు కుటుంబం ప‌ట్ల ఎంతో బాధ్య‌త‌గా ఉంటారు. త‌మ ప్రియ‌మైన వారితో గ‌డ‌ప‌డానికి ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. వారు బ‌య‌టికి వెళ్ల‌డానికి బ‌దులుగా, ఇంట్లోనే ఎక్కువ‌గా మీతోనే స‌మ‌యం గ‌డ‌పాల‌ని కోరుకుంటారు. వీరు చాలా ద‌య హృద‌యం క‌ల‌వారు. ఈ రాశి గ‌ల పురుషులు గొప్ప తండ్రులుగా కీర్తించ‌బ‌డుతారు. ఎందుకంటే వారు త‌మ జీవితంలో ఎక్కువ స‌మ‌యాన్ని కుటుంబ స‌భ్యుల‌తోనే గ‌డుపుతారు.

సింహం :

Simham

Simham

సింహ‌రాశి గ‌ల పురుషులు మిమ్మ‌ల్ని హృద‌య పూర్వ‌కంగా న‌వ్వించ‌గ‌ల‌రు. వీరు ఎల్ల‌ప్పుడూ మిమ్మ‌ల్ని సంతోషంగా ఉంచ‌డానికి మిమ్మ‌ల్ని న‌వ్వించ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఈ రాశికి చెందిన పురుషుడు మీ జీవిత భాగ‌స్వామి అయితే మీ జీవితం సుఖ‌వంతంగా, సంతోషంగా గొప్ప‌గా మారుతుంది. వీరు మీ ప‌ట్ల చాలా స‌హాయ‌కారిగా, న‌మ్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తారు.

ధ‌న‌స్సు :

Danassu

Danassu

ధ‌నుస్సు రాశి పురుషులు మీ ప‌ట్ల ఎక్కువ శ్ర‌ద్ధ వ‌హిస్తారు. వీరు చాలా ఉత్తేజ‌క‌ర‌మైన సృజ‌నాత్మ‌క ఆలోచ‌న‌లు క‌లిగి ఉంటారు. అంతేకాదు.. వీరు ఆ విష‌యం ప‌ట్ల ఎక్కువ‌గా ఆస‌క్తి కలిగి ఉంటారు. మీ ప‌ట్ల న‌మ్మ‌కంగా, స్థిరంగా ఉంటారు. కొన్ని స‌మ‌యాల్లో అసూయ‌ప‌డ‌డానికి భ‌య‌ప‌డ‌రు. మీరు ధ‌నుస్సు రాశికి చెందిన జీవిత భాగ‌స్వామిని ఎంచుకుంటే మీ జీవితం సుఖ‌మ‌యం అవుతుంది.

మీనం :

Meenam

Meenam

మీన రాశికి చెందిన పురుషులు ఉత్త‌మ భ‌ర్త‌గా నిలుస్తారు. వారి భాగ‌స్వామితో ఎప్పుడూ చాలా అంకిత భావంతో ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ధృడ‌మైన మ‌న‌స్థ‌త్వాన్ని క‌లిగి ఉంటారు. అంతేకాదు.. ఆర్థికంగా కూడా కుటుంబాన్ని ఉన్న‌త స్థితిలో ఉంచ‌డానికి ఎల్ల‌ప్పుడు ప్ర‌య‌త్నిస్తున్నారు. వీరు అన్ని విష‌యాల్లో మిమ్మ‌ల్ని ఎంతో ఆనందంలో ముంచెత్తుతున్నారు.

ఇవి కూడా చదవండి :

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి కుటుంబంలో త‌గాదాలు వ‌స్తాయి

రేవంత్‌రెడ్డిని రియ‌ల్ టైగ‌ర్ ఆఫ్ తెలంగాణ‌గా వ‌ర్ణించిన వ‌ర్మ

Visitors Are Also Reading