Home » ముప్పై ఏళ్ల‌కే ముడ‌తలా.. ఫోన్‌తో ఎక్కువ‌సేపు గ‌డిపితే ఇక అంతే..!

ముప్పై ఏళ్ల‌కే ముడ‌తలా.. ఫోన్‌తో ఎక్కువ‌సేపు గ‌డిపితే ఇక అంతే..!

by Anji
Ad

చాలా కాలం త‌రువాత ఈ మ‌ధ్య మిమ్మ‌ల్ని క‌లిసిన వారు ఏంటి అలా అయిపోయావ‌ని అంటున్నారా..? అయితే క‌చ్చితంగా మీరు ఫోన్ కి దూరంగా ఉండాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడుతూ, చాట్ చేస్తూ ఫోన్‌తో గ‌డిపితే చ‌ర్మం త్వ‌ర‌గా ముడుత‌లు ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

ముఖ్యంగా ఫోన్‌, ల్యాప్‌టాప్‌ల‌లో ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌డం వ‌ల్ల వృద్ధాప్య ప్ర‌క్రియ వేగవంతం అవుతుంద‌ని అధ్య‌య‌నం చెబుతోంది. బ్లూ లైట్ ఎక్స్‌పోజ‌ర్ ఫ్లై హెడ్స్ క‌ణాల్లో గ‌ణ‌నీయ‌మైన వ్య‌త్యాసాల‌ను గుర్తించారు. ప్ర‌ధానంగా మెటాబోలైట్ స‌క్సినేట్ స్థాయిలు పెరిగిన‌ట్టు క‌నుక్కున్నారు. గ్లూటామేట్ స్థాయిలు త‌గ్గాయి. గాడ్జెట్‌ల‌పై ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌డం ద్వారా మీ కంటి చూపు లేదా మాన‌సిక ఆరోగ్యంపై ప్ర‌భావం చూపిస్తోందని కొత్త అధ్య‌య‌నం పేర్కొంటుంది. ప్రాంటియ‌ర్స్ ఇన్ ఏజింగ్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించిన అధ్య‌య‌నం ప్ర‌కారం.. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల‌తో స‌హా గాడ్జెట్ల నుంచి వ‌చ్చే అధిక నీలి కాంతి వృద్ధాప్య ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేస్తుంద‌ని సూచించింది.

ఇది కూడా చ‌దవండి :  గాడిద పాల‌తో త‌యారు చేసిన స‌బ్బు వాడితే క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి మీకు తెలుసా..?

Advertisement

ఇక టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌ల వంటి రోజు వారి ప‌రిక‌రాలు బ్లూ లైట్‌ను అధికంగా బ‌హిర్గం చేస్తుంటాయి. దీంతో వృద్ధాప్యం వేగ‌వంతం అవుతుంది. మెద‌డు ప‌ని తీరు కూడా క్షీణింప‌జేస్తుంది. ఇటీవ‌ల నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా పిల్ల‌లు గ్యాడ్జెట్ల‌కు ఎక్కువ‌గా అల‌వాటు ప‌డ్డార‌ని తెలిపారు. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో ఎక్కువ స‌మ‌యం ఫోన్లు, ల్యాప్‌టాప్ ల‌తోనే ఉన్నార‌ని వాపోయారు. ఇది పిల్ల‌ల శారీర‌క, మాన‌సిక‌, సామాజిక ఎదుగుదల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని ఓ స‌ర్వేలో పాల్గొన్న 95 శాతం మంది త‌ల్లిదండ్రులు విశ్వ‌సించారు. దాదాపు 62 శాతం మంది త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌లు ప్ర‌తి రోజు నాలుగు నుంచి ఆరు గంట‌లు ఎల‌క్ట్రానిక్ గాడ్జెట్‌ల కోసం వెచ్చిస్తున్నార‌ని పేర్కొన్నారు. 23 శాతం మంది త‌ల్లిదండ్రులు వారాంతాల్లో అయితే ఆరు గంట‌ల‌కు పైగా త‌మ పిల్ల‌లు ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌ను ఉప‌యోగిస్తున్నార‌ని చెప్పారు. స్క్రీన్ స‌మ‌యాన్ని ప‌రిమితం చేయ‌డం అనేది మంచి యాంటీ ఏజింగ్ స్ట్రాట‌జీగా ప‌ని చేస్తుంది.

ఇది కూడా చ‌దవండి :  రోజు రోజుకు పెరుగుతున్న కుక్క‌కాటు బాధితుల సంఖ్య‌.. క‌రిచిన వెంట‌నే ఇలా చేస్తే..!

Visitors Are Also Reading