ఎక్కువ చలిగానీ, వేడిగానీ ఉంటే చాలా మందికి తుమ్ముల సమస్య ఉంటుంది. తరుచుగా తుమ్ములు రావడం వల్ల తలనొప్పి ఇబ్బంది పెడుతుంది. ఏకాగ్రతతో దెబ్బతింటుంది. దీని నుంచి ఉపశమనం పొందడానికి వైద్యుని సహాయం లేదా మందులు తీసుకుంటారు. కానీ తరుచుగా ఇలా ఎందుకు జరుగుతుందో కారణం తెలుసుకోరు. నిజానికి దీని వెనుక సైనస్ లాంటి వ్యాధి ఉండవచ్చు. సైనస్ అనేది ముక్కులో ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడిన ఒక వ్యాధి. దీని కారణంగా నిరంతరం తుమ్ములు వస్తూ ఉంటాయి. సైనస్ వల్ల ముక్కు కారడం ప్రారంభమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దీనిని వదిలించుకోవడానికి శస్త్రచికిత్స ఒక్కటే మార్గం. సైనస్ రావడానికి అలర్జీలు కూడా ఒక కారణం కావచ్చు. చాలా మంది దీనిని తేలికగా తీసుకుంటారు. కానీ ఎక్కువ అనారోగ్యంతో ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి బలహీన పడుతుంది. ఇతర వ్యాధులు చుట్టు ముడుతాయి. వైద్యుల సలహా మేరకు ఇంటి పద్దతుల ద్వారా కూడా ఈ సమస్యను వదిలించుకోవచ్చు.
Advertisement
మిమ్మల్ని మీరు హైడ్రేటేడ్‌గా ఉంచుకోవడం మంచిది. మీరు సైనస్‌ను తొలగించాలనుకుంటే ఎక్కువ నీరు తాగాలి. ఇది కాకుండా ముక్కు లోపల పొడిని తొలగించడానికి ఇంట్లో హ్యుమిడి ఫైయర్ ఉపయోగించవచ్చు. దీనివల్ల ముక్కు చుట్టూ తేమ ఉంటుంది.
Advertisement
చికెన్ సూప్
మీరు నాన్ వెజ్ తింటే చికెన్ సూప్ మీకు బెస్ట్ ఆప్షన్. దీనిని తీసుకోవడం వల్ల శరీరం లోపల వెచ్చగా ఉంటుంది. దీని వల్ల ముక్కుకు సబంధించిన సమస్యలే కాదు. చాతీకి సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయి. ఆరోగ్యానికి చాలా మేలు చేసే చికెన్ సూప్‌లో అనేక పదార్థాలు కలుపుతారు. విటమిన్ -ఏ, జింక్, విటమిన్ సి, అనేక యాంటి యాక్సిడెంట్ గుణాలుంటాయి. జలుబు సమయంలో తాగడం మంచిది.
ఆవిరి పట్టడం
ఇంట్లో ఆవిరి పట్టడం ద్వారా కూడా సైనస్ సమస్య నుంచి బయట పడొచ్చు. ఆవిరి పట్టడం వల్ల మూసుకుపోయిన ముక్కు తెరుచుకోవడంతో పాటు లోపల ఉన్న ఇన్పెక్షన్ కూడా తగ్గుతుంది. ఆవిరి పట్టడం వల్ల రెస్పిరేటరి ట్రాక్ క్లియర్ అవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆవిరిని తీసుకోవడం వల్ల శ్లేష్మం పలుచబడి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ఆవిరి పట్టేటప్పుడు ముఖాన్ని వేడి నీటికి దగ్గరగా ఉంచకూడదు. 5 నిమిషాల పాటు ఆవిరి పడితే సరిపోతుంది.
Also Read : సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతున్నారా.. క్యాన్సర్, గుండె జబ్బులు ఖాయం..!