సుమారు 25 సంవత్సరాల కిందట వచ్చిన పోలీస్ స్టోరీ ఎంత హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. సాయికుమార్ విశ్వరూపం చూపించిన చిత్రం అది. సాయికుమార్ డైలాగ్స్ ఇప్పటికీ పాపులర్. సాయి కుమార్ గారు ఇప్పటికీ తెరమీద కనిపిస్తున్నారు అంటే అది పోలీస్ స్టోరీ చొరవే. ఈ సినిమాకు ఆయన జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పవచ్చు. ఆ సినిమా గురించి కొన్ని విషయాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 1995 కన్నడలో దేవరాజు హీరోగా రూపొందుతున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ షూటింగ్ జరుగుతోంది.అందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సాయికుమార్ చనిపోయే షూట్ తీస్తున్నారు. అయితే ఆ షూటింగ్ లో జరుగుతున్న సాయి కుమార్ స్పార్క్ చూసి ఇతన్నే హీరోగా పెట్టి సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారు థ్రిల్లర్ మంజు. మొదటిగా కథ విన్న సాయికుమార్ ఇందులో ఏదైనా హీరో తమ్ముడు,అన్నయ్యో పాత్రలు దొరికితే చాలని అనుకున్నారు.
Advertisement
Advertisement
కానీ ఏకంగా హీరో అనగానే కన్నీళ్లు ఆగలేదు. త్రిల్లర్ మంజు కాళ్ళమీద పడినంత పని చేసారు సాయి కుమార్. సాయికుమార్ నట విశ్వరూపానికి సెట్ లో ఎవరికి మాటలు రావడం లేదు. సినిమా సగం షూటింగ్ అయిపోయాక నిర్మాత దగ్గర డబ్బులు ఖాళీ అయ్యాయి. సినిమా మీద ఉన్న నమ్మకంతో బయట పది రూపాయల వడ్డీ కి అప్పు తెచ్చి ఖర్చు పెట్టారు. ఇందులో సాయికుమార్ రెమ్యూనరేషన్ 50,000. సినిమా బడ్జెట్ మొత్తం అన్ని కలిపి 39 లక్షల దాకా తేలింది. బెంగళూరు థియేటర్లో సినిమా ప్రివ్యూ వేస్తే పెద్దవాళ్ళు వచ్చి సినిమా చూసి ఏమీ మాట్లాడలేదు. బాగుందా బాలేదా అనేది చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత కర్ణాటక మొత్తం పోలీస్ స్టోరీ రిలీజ్ అయింది. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరిలో ఆనందం, ఉద్వేగంగా కనిపించింది. అంతే సినిమా సూపర్ హిట్ అయిందని అర్థం అయిపోయింది.
విషయం తెలిసిన సాయి కుమార్ ఫ్యామిలీ తో సహా బెంగళూరు వచ్చేశారు. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే. కట్ చేస్తే.. ఒక కర్ణాటకలోనే ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా కర్ణాటకలో సూపర్ హిట్ కావడంతో తెలుగులో కూడా డబ్ చేయాలని సినిమా యూనిట్ భావించింది. ఇక తెలుగులో విడుదలైన తొలి రోజే సూపర్ హిట్ టాక్ వచ్చింది. సాయికుమార్ యాక్షన్,డైలాగ్స్ జనాలను అలరించాయి. తెలుగునాట పోలీస్ స్టోరీ ప్రభంజనం సృష్టించింది. ఇక్కడ కూడా 7 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి. తర్వాత హిందీ, తమిళంలో రిలీజ్ చేయగా మరో ఆరు కోట్లు , ఇతరత్రా ఆదాయాలు అన్ని కలిపి పాతిక కోట్ల దాకా వసూలు చేసింది పోలీస్ స్టోరీ. పెట్టింది 40 లక్షలు వచ్చింది కానీ 25 కోట్లు వచ్చాయి.