Home » తేనే ఎక్కువగా తింటున్నారా..? ఈ విష‌యం త‌ప్ప‌కుండా తెలుసుకోండి.

తేనే ఎక్కువగా తింటున్నారా..? ఈ విష‌యం త‌ప్ప‌కుండా తెలుసుకోండి.

by Anji
Ad

తేనే చ‌ర్మం, జుట్టు, శ‌రీర ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిన‌దే. అతి ఎప్పుడూ అన‌ర్థ‌దాయ‌క‌మే. తేనే విష‌యంలో కూడా ఎటువంటి మిన‌హాయింపు లేదు. తేనెను అధికంగా తీసుకుంటే క‌లిగే దుష్ప్ర‌భావాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

బ‌రువు పెర‌గ‌డం

రోజు ఒక టీ స్పూన్ తీసుకుంటే బ‌రువు త‌గ్గుతార‌ని అంద‌రూ అనుకుంటారు. అయితే అది నిజం కాదు. తేనే చ‌క్క‌ర కంటే త‌క్కువ తీపిని క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ బ‌రువును పెంచ‌డం మాత్రం ఖాయం.


ర‌క్తంలో చ‌క్కెర

ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా ఉప‌యోగ‌క‌రం. కానీ నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం.. తేనేను అధికంగా తీసుకుంటే శ‌రీరంలో గ్లూకోజ్ స్థాయిల‌ను పెంచుతుంది. అందుకే తేనేను ప‌రిమితంగా తినాలి.

Also Read :  ఎన్టీఆర్‌కు మోసం.. ఆ రోజు రాత్రి అలా జ‌రగ‌డంతో ముర‌ళీ మోహ‌న్‌కు క‌డుపు మండిపోయింద‌ట.!

Advertisement

దంతాలు

తేనేను ప‌దే ప‌దే తిన‌డం వ‌ల్ల‌, తీపి కార‌ణంగా నోటిలో బ్యాక్టీరియా స‌మ‌స్య ప్రారంభ‌మ‌వుతుంది. ఈ బ్యాక్టీరియా దంతాల‌పై చెడు ప్ర‌భావం చూపుతుంది. దీని వ‌ల్ల నోటి నుంచి దుర్వాస‌న కూడా త‌లెత్తుతుంది.

జీర్ణ‌క్రియ

తేనేను అధికంగా తీసుకోవ‌డం ద్వారా జీర్ణ‌వ్య‌వ‌స్థ‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంది. క‌డుపు నొప్పి ఇత‌ర స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంది. తేనేను అధికంగా తింటే డ‌యేరియా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

ర‌క్త‌పోటు

ముఖ్యంగా ర‌క్త‌పోటు స‌మ‌స్య‌లు ఉన్న‌వారు తేనే తిన‌డం మానుకోవాలి. తేనేలోని తీపి వ‌ల్ల ర‌క్త‌పోటు పెరిగే అవ‌కాశం ఉంద‌నేది నిపుణుల అభిప్రాయం.

Also Read :  హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో నిర్మించిన తొలి వంతెన ఏదో తెలుసా..?

Visitors Are Also Reading