Home » కళాతపస్వి విశ్వనాథ్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

కళాతపస్వి విశ్వనాథ్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

కళాతపస్వి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గురువారం రాత్రి మరణించిన విషయం విధితమే. ఈయన మరణ వార్త తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఒక్కసారిగా  కృంగదీసింది. ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన లెజెండరీ డైరెక్టర్ కె.విశ్వనాథ్ మరణించడంతో భారీగా సినీ సెలబ్రిటీలు తరలివచ్చి ఆయన పార్థీవ దేహానికి నివాళులర్పించారు. 

Advertisement

కాసేపట్లో విశ్వనాథ్ గారి అంత్యక్రియలు ముగియనున్నాయి. ఇలా తెలుగు సినీ పరిశ్రమలో సుమారు 51 సినిమాలకు దర్శకత్వం వహించగా.. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా చాలా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. దర్శకుడిగా, నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న విశ్వనాథ్ గారు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఈయన ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంత మొత్తంలో ఆస్తులు సంపాదించారనే విషయంపై నెటిజన్లు ఇప్పుడు ఆరా తీస్తున్నారు.  

Advertisement

Also Read :   చైతూతో ఉన్న ఆ ఒక్క తీపి గుర్తును కూడా చెరిపి వేసిన సమంత !

సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే భారీగానే ఆస్తులను కూడపెట్టారని.. ఇది తన ముగ్గురు వారసులకు సమానంగా పంచి ఇచ్చారని సమాచారం. విశ్వనాథ్ కి జూబ్లీహిల్స్ లో సుమారు రూ.12కోట్ల విలువ చేసే ఇంటితో పాటు హైదరాబాద్ శివారులో దాదాపు 8 ఎకరాల పొలం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈయనకు ఇద్దరూ కుమారులు, ఒక కుమార్తె కలదు. తాను సంపాదించిన ఆస్తులు మొత్తం తన ముగ్గురు వారసులకు సమానంగా రావాలనే ఉద్దేశంతో ఈయన 130 కోట్ల రూపాయల ఆస్తిని మొత్తం తన ముగ్గురు వారసుల పేరిట సమానంగా రాసిచ్చారని సమాచారం. తాను మరణించిన తరువాత ఆస్తి విషయంలో తన వారసులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా విశ్వనాథ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  

Also Read :  నిజం సినిమాలో అతని యాక్టింగ్ నచ్చక మళ్లీ ప్రకాశ్ రాజ్ తో షూట్ చేశారు.. ఆ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా ? 

Visitors Are Also Reading