Home » యాల‌కుల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే వాటిని తిన‌కుండా ఉండ‌రు..!

యాల‌కుల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే వాటిని తిన‌కుండా ఉండ‌రు..!

by Anji
Ad

యాల‌కుల గురించి ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసే ఉంటుంది. యాల‌కుల‌ను ప్ర‌ధానంగా టీ, స్వీట్లు, ప‌లు ర‌కాల వంట‌కాల త‌యారీలో వినియోగించ‌డం ద్వారా ఆహార రుచిని పెంచ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. యాల‌కుల్లో బోలెడ‌న్ని పోష‌కాలు దాగి ఉన్నాయి. ఇవి శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి. యాల‌కులు గ‌రం మ‌సాలాల్లో వినియోగిస్తారు. దీని సువాస‌న ఎంత‌గానో ఆక‌ర్షిస్తుంది. యాల‌కుల‌ను స్వీట్లు, టీ, ప‌లు ర‌కాల వంటకాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. యాల‌కుల వాడ‌కం ఆహార రుచిని పెంచ‌డ‌మే కాకుండా.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. చిన్న యాల‌కులు మ‌న ఆరోగ్యానికి ఎలా ఉప‌యోగ‌ప‌డుతాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

యాల‌కుల వల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు :

ముఖ్యంగా యాల‌కుల‌ను సాధార‌ణంగా నేచుర‌ల్ మౌత్ ప్రెష‌న‌ర్‌గా వినియోగిస్తుంటారు. రోజు న‌మిలి తింటే నోటి దుర్వాస‌న మ‌టుమాయ‌మ‌వుతుంది. చాలా మంది ఫేస్ నిగారింపు కోసం అంద‌రూ తెగ క‌ష్ట‌ప‌డుతుంటారు. దీనికోసం యాల‌కులను మీరు ఉప‌యోగించవ‌చ్చు. ముఖానికి యాల‌కుల నూనెను వినియోగిస్తే.. అది మ‌చ్చ‌ల‌ను తొల‌గించి మెరిసిపోయే విదంగా చేస్తుంది. కావాలంటే యాల‌కుల పొడి చేసి అందులో కొద్దిగా తేనే క‌ల‌పాలి. ఆ త‌రువాత ఈ ఫేస్ మాస్క్ ను ముఖానికి అప్లై చేసి కాసేపు అలాగే ఉంచాలి. గంట త‌రువాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

Advertisement


యాల‌కుల‌ను చాలా బ్యూటీ ప్రొడ‌క్ట్స్, లిప్ కేర్ క్రీముల్లో ఉప‌యోగిస్తార‌న్న విష‌యం చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. యాల‌కులను గ్రైండ్ చేసి పౌడ‌ర్ మాదిరిగా త‌యారు చేసుకోవాల‌ని దానిని తేనెలో మిక్స్ చేసి పెద‌వుల‌పై రుద్దండి. 15 నిమిషాల త‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేయ‌డం వ‌ల్ల పెదాలు మృదువుగా అందంగా త‌యార‌వుతాయి. క్ర‌మం త‌ప్పకుండా యాల‌కుల‌ను తిన‌డం ద్వారా అవి శ‌రీరంలోంచి విషాన్ని బ‌య‌టికి పంపించ‌డంలో స‌హాయ ప‌డుతాయి. శ‌రీర నిర్విషీక‌ర‌ణ ప్ర‌భావం ముఖంపై కూడా క‌నిపిస్తుంది. దీంతో చ‌ర్మం చాలా నీట్‌గా మారి ముఖంపై అద్భుత‌మైన గ్లో వ‌స్తుంది. ఇంకెందుకు ఆల‌స్యం యాల‌కుల వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్న‌ప్పుడు మీకు న‌చ్చిన విధంగా ఉప‌యోగించుకోండి.

Also Read : 

Astrology : ఆగ‌స్టు నెల‌లో ఈ నాలుగు రాశుల‌ వారిని అదృష్టం వ‌రిస్తుంది.. వారు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

 

Visitors Are Also Reading