బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా, నయనతార హీరోయిన్ గా నటించిన జవాన్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 07న ఈ చిత్రం విడుదలై.. అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా వారం రోజుల్లో దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. పఠాన్ మూవీతో మంచి సక్సెస్ సాధించిన షారుఖ్.. వెంటనే జవాన్ మూవీతో కూడా ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలనం సృష్టించారు.
Advertisement
జవాన్ మూవీలో నయన తార ప్రధాన పాత్రలో నటించగా.. బాలీవుడ్ నటి దీపికా పడుకొనే గెస్ట్ రోల్ లో నటించారు. ఈ చిత్రంలో దీపిక గెస్ట్ పాత్రలో నటించినప్పటికీ అందుకు భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో దీపిక నటించినందుకు సుమారు రూ.15కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై దీపికా స్పందించారు. ఈ సందర్భంగా ఈమె తన రెమ్యునరేషన్ గురించి వస్తున్నటువంటి వార్తలను పూర్తిగా ఖండించారు. జవాన్ మూవీ కోసం తాను రూ.15కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాను అని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు.
Advertisement
ఈ చిత్రంలో నటించినందుకు తాను ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని.. తాను ఉచితంగా ఈ చిత్రంలో నటించానని తెలియజేశారు. తన భర్త నటించిన 83 చిత్రానికి గాను తాను ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. భర్త విజయంలో భార్య భాగమయ్యే పాత్రలో తాను నటించాను అందుకే రెమ్యునరేషన్ తీసుకోలేదు. షారుఖ్ ఖాన్ రోహిత్ శెట్టి.. సినిమాలకు తాను రెమ్యునరేషన్ తీసుకోకుండా గెస్ట్ రోల్స్ చేస్తానంటూ.. దీపికా పదుకునే చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
హీరోలందరూ రాజమౌళి కోసం వెయిట్.. కానీ ఆయన ఆ స్టార్ కోసం ఎదురుచూస్తున్నాడా ?
చంద్రబాబు తరపు లాయర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు.. అందుకోసమేనా ?