Home » హీరో రాజ‌శేఖ‌ర్ త‌మ్ముడు బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

హీరో రాజ‌శేఖ‌ర్ త‌మ్ముడు బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

by Anji
Ad

సాధార‌ణంగా సినిమా హీరోల ఫ్యామిలీ గురించి తెలుసుకోవ‌డానికి అంద‌రూ చాలా ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇలా సినీ సెల‌బ్రీటీల‌కు సంబంధించిన ఏ విష‌యం అయినా స‌రే సోష‌ల్ మీడియాలోకి వ‌స్తే అది క్ష‌ణాల వ్య‌వ‌ధిలో వైర‌ల్‌గా మారిపోవ‌డం ప‌క్కా..

Advertisement

ఇక ఇప్పుడు హీరో రాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీ గురించి ఓ వార్త అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. హీరో రాజ‌శేఖ‌ర్ అన‌గానే ఒక‌ప్ప‌టి హీరోయిన్ జీవిత కూతుర్లు శివాని, శివాత్మిక మాత్ర‌మే గుర్తుకొస్తుంటారు.

ఇది కూడా చ‌ద‌వండి :  టీవీ రేటింగ్స్ లో కూడా ఆర్ఆర్ఆర్ తగ్గలేదుగా..?

వీరంద‌రూ టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం ఉన్న వారే. జీవిత రాజ‌శేఖ‌ర్ కూతుర్లు శివాత్మిక‌, శివాని ప్ర‌స్తుతం హీరోయిన్లుగా కొన‌సాగుతున్నారు. వీరి గురించి అంద‌రికీ తెలిసే ఉంటుంది. కానీ హీరో రాజ‌శేఖ‌ర్‌కి ఓ త‌మ్ముడు ఉన్నాడ‌ని, ఆ త‌మ్ముడు పెద్ద బిజినెస్‌మేన్ అని రాజ‌శేఖ‌ర్ త‌మ్ముడు పెళ్లి చేసుకున్న అమ్మాయి స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కూతురు అనే విష‌యం చాలా త‌క్కువ మందికే తెలుసు. చాలా వ‌ర‌కు అస‌లు ఈ విష‌యం తెలియ‌నే తెలియ‌దు. హీరో రాజ‌శేఖ‌ర్‌కి గుణ శేఖ‌ర్ అనే త‌మ్ముడు ఉన్నాడు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  పుష్ప మరియు లైగర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. కింగ్ ఎవరంటే..?

రాజ‌శేఖ‌ర్ త‌మ్ముడు గుణ‌శేఖ‌ర్ వ‌జ్రాల వ్యాపారం చేస్తుంటాడ‌ట‌. హైద‌రాబాద్‌లో ఉన్న గుణ డైమండ్స్ స్టోర్‌ల‌కి రాజ‌శేఖ‌ర్ త‌మ్ముడే య‌జ‌మాని కావ‌డం విశేషం. ఇక రాజ‌శేఖ‌ర్ త‌మ్ముడు గుణ‌శేఖ‌ర్ త‌మిళ స్టార్ సంగీత ద‌ర్శ‌కుడు శంక‌ర్ గ‌ణేష్ కూతురు శ్రీ‌దేవిని వివాహం చేసుకున్నార‌ట‌. ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని త‌మిళ మ్యూజిక్ డైరెక్ట‌ర్ శంక‌ర్ గ‌ణేష్ చెప్పుకొచ్చారు. త‌న కూతురు హీరో రాజ‌శేఖ‌ర్ త‌మ్ముడు గుణశేఖ‌ర్ భార్య అనే విష‌యం చాలా మందికి ఎవ్వ‌రికీ కూడా తెలియ‌ద‌ని పేర్కొన్నారు. మా అల్లుడు వ‌జ్రాల వ్యాపారి అని అస‌లు విష‌యాన్ని చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్యప‌రిచాడు సంగీత ద‌ర్శ‌కుడు శంక‌ర్ గ‌ణేష్‌.

ఇది కూడా చ‌ద‌వండి :  అల్లంతో అన్‌వాంటేడ్ హెయిర్‌ని తొల‌గించ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Visitors Are Also Reading