Home » Vasth tips:ఈ వాస్తు సూత్రాలు మీరు పాటిస్తే సంపాదనలో తిరుగు ఉండదు..!!

Vasth tips:ఈ వాస్తు సూత్రాలు మీరు పాటిస్తే సంపాదనలో తిరుగు ఉండదు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వాస్తుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. చాలామంది వాస్తును ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే వారికి సంబంధించిన వ్యవహారాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటే కలిసి వస్తుందని భావిస్తూ ఉంటారు. ఆ విధంగా వాస్తు సూత్రాలు భావించేవారు వారి యొక్క వ్యాపార రంగంలో ఎలాంటి టిప్స్ పాటించాలి.. ఏ టిప్స్ పాటించడం వల్ల మీకు అధిక ధన లాభం కలుగుతుంది .. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా రెస్టారెంట్ ఆఫీస్ వంటి కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముందు గణపతి దేవునికి పూజలు తప్పనిసరిగా చేసి ఆశీర్వాదం పొందాలట.. ఏదైనా కన్స్ట్రక్షన్ ప్రారంభించే ముందు వాస్తు శాస్త్రం ప్రకారం లేఔట్స్ చూసుకోవాలి..

Advertisement

also read:Pakeezah: పెద రాయుడు సినిమాలో పాకీజా గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?

ముఖ్యంగా బస్ స్టాప్, దేవాలయం, విమానాశ్రయం వంటి వాటి దగ్గర కాంప్లెక్స్, లేదా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేస్తే శుభం కలుగుతుందట. అంతేకాకుండా ప్రవేశ ద్వారానికి స్వస్తిక్ చిహ్నాలు ఉండాలట. మరీ ముఖ్యంగా చెట్లు, స్తంభాలు వంటి అడ్డంకులు ఉండకూడదని అంటున్నారు.. స్వస్తిక్ చిహ్నాలను ముందు పెట్టడం వల్ల అనేక దోషాలు పోయి అదృష్టం వస్తుందని అంటున్నారు వాస్తు నిపుణులు. అంతేకాదు పూజ చేసే ప్రదేశం ఈశాన్య దిశలో ఉండాలి. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు ఉద్యోగులు తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండాలి. అంతేకాకుండా నగదు పెట్టెను ఉత్తరం లేదా తూర్పున తెరిచే విధంగా ఉంచండి. ఈశాన్యంలో నీటి ఫౌంటెన్ ఏర్పాటు చేసుకోండి.

Advertisement

ఇక ఆఫీస్ యొక్క ప్రవేశద్వారం ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంటే మంచిది. ప్రవేశ ద్వారం ముందు చిన్న గది లేదా టాయిలెట్ కూడా లేకుండా చూసుకోండి. ఇక ముఖ్యంగా శక్తి ప్రవాహం పొందాలి అంటే ఆఫీసులో ఉన్న అన్ని తలుపులు మీరు ఉన్నంత సేపు తెరిచి ఉంచాలి. ఇక రెస్టారెంట్ వంటి బిజినెస్ పెట్టాలనుకుంటే ముందుగా స్థలాన్ని అంచనా వేయాలి. దగ్గర్లోని ప్రాంతాలను చెక్ చేసుకోవాలి. దాని ప్రవేశ ద్వారం ఆకర్షణీయంగా ఉండాలి. ఇక ముఖ్యంగా రిసెప్షన్ డెస్కు ప్రవేశద్వారం ఎడమవైపున మంచిది. ఇక వంటగది ఆగ్నేయంలో బార్ దక్షిణం లేదా నైరుతిలో ఉంటే సామాగ్రి స్టోరేజ్ నైరుతిలో ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటే లాభం కలుగుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు.

also read:

Visitors Are Also Reading