Home » సపోటా పండ్లు  తింటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

సపోటా పండ్లు  తింటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

by Sravanthi Pandrala Pandrala

సపోటా ఎండాకాలం సీజన్లో ఎక్కువగా లభించే పండు. దీన్ని తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొంతమందికి మాత్రం సపోటా పండు హాని చేస్తుంది. ఇది పడనివారు తినకపోతే మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. పండు తింటే చాలా స్వీట్ గా ఉంటుంది. అందుకే ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో అనేక కేలరీలు పోషక పదార్థాలు ఉంటాయి.

 

ఇన్ని ఉన్న ఈ పండ్లు తింటే కొంతమందికి గొంతులో దురద గా ఉంటుందట. అటువంటి వారు ఈ పండ్లు తినకపోవడమే శ్రేయస్కరమని అంటున్నారు. దీన్ని తినడం వల్ల మలబద్దకం సమస్య కూడా కంట్రోల్ లో ఉంటుంది. అంతేకాకుండా సపోటా జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇందులో అనేక ఖనిజలవణాలు మినరల్స్ ఉంటాయి. కాబట్టి ఈ పండ్లను పాలిచ్చే తల్లులు గర్భిణిలు తింటే చాలా మంచిదట.

 

అలాగే జుట్టు రాలే సమస్య నుంచి కూడా సపోటా కాపాడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ సపోటను కొంతమంది తింటే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు దీనికి దూరంగా ఉండాలి. తింటే ఎవరికైతే గొంతులో గరగర అనిపిస్తుందో వారు కూడా ఈ పండ్లు తినకూడదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇది కూడా చదవండి:

గాడ్ ఫాద‌ర్ సినిమాలో క‌థ‌ను మలుపుతిప్పే పాత్ర‌లో పూరిజ‌గ‌న్నాత్…పాత్ర ఏంటంటే…!

ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్‌.. ఫ‌స్ట్ ఫాస్టెస్ట్ 100 కోట్లు కొల్ల‌గొట్టిన కేజీఎఫ్ 2

ఆర్టీసీ బ‌స్సులో నోట్ల క‌ట్ట‌ల క‌ల‌క‌లం.. ఎక్క‌డంటే..?

 

Visitors Are Also Reading