సాధారణంగా కొబ్బరి నూనె పేరు వినగానే జుట్టుకి అప్లై చేసుకునే ఒక ఆయిల్ అని గుర్తుకొస్తుంది. కొబ్బరి నూనె చాలామంది జుట్టుకి, బాడీకి మసాజ్ చేస్తూ ఉంటారు. అయితే దీనిని కేరళ రాష్ట్రంలో మాత్రం వంట చేయడానికి కొబ్బరి నూనెను వాడుతూ ఉంటారు. ఎందుకంటే దీనిలో ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉంటాయి. ఈ ఆయిల్ తో వంట చేసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వారు కొబ్బరి నూనెతో వంటలు చేస్తూ ఉంటారు. అయితే ప్రతిరోజు ఉదయం కొబ్బరి నూనె తాగినట్లయితే.. ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనె తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Advertisement
- కొబ్బరి నూనె త్రాగడం వలన పేగు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని యాంటీ మైక్రో బయల్ లక్షణాలు జీర్ణ సమస్యలు మలబద్ధకం నుంచి ఉపసమనం కలిగిస్తుంది.
- కొబ్బరి నూనె తీసుకోవడమే కాకుండా చర్మాన్ని కూడా అప్లై చేయడం వలన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీ చర్మాన్ని సాగేలా చేస్తాయి. మీ చర్మం మృదువుగా మారుతుంది. జుట్టుకు కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అందమైన ఆరోగ్యకరమైన జుట్టును పొందవచ్చు.
- ఆరోగ్యకరమైన గుండె కోసం ఈ ఆహారంలో కొబ్బరినూనె చేర్చుకోవాలి. ఈ కొబ్బరినూనె ప్రతిరోజు తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ని వలసిన సమతుల్యం చేస్తుంది.చెడు కొలెస్ట్రాల్ ను కూడా కరిగిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
- శరీర బరువును తగ్గించడంలో కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాల మిశ్రమం మీ ఆకలిని అదుపులో ఉంచి కోరికలను తగ్గిస్తుంది.
- కొబ్బరి నూనెలో లారీక్ యాసిడ్ ఉంటుంది. ఆంటీ మైక్రోబయల్ లక్షణాలు కోకోనట్ ఆయిల్లో పుష్కలంగా ఉంటాయి. దాంతో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే అంటువ్యాధులను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.
Also Read : టీ లో చక్కెరతో పాటు ఉప్పు వేసుకుంటే ఏమవుతుందో తెలుసా ?