Home » రాత్రి వేళలో భోజనం విషయంలో ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీరు డేంజర్ లో పడినట్టే.. జాగ్రత్త..!

రాత్రి వేళలో భోజనం విషయంలో ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీరు డేంజర్ లో పడినట్టే.. జాగ్రత్త..!

by Anji
Ad

సాధారణంగా చాలా మంది రాత్రి సమయంలో భోజనం చాలా హెవీగా చేస్తుంటారు. ఎక్కువ మంది మధ్యాహ్నం భోజనం కంటే రాత్రి పూట భోజనమే ఇష్టంగా తింటుంటారు. పగటిపూట ఆఫీస్ లలో లేదా కొన్ని పనుల మీద పడి ఏదో ఒకటి మధ్యాహ్నం తింటుంటారు. కానీ రాత్రి సమయంలో ఎక్కువగా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఇష్టమైన ఆహారం కొంచెం పుష్టిగా తింటుంటారు. కానీ వాస్తవానికి రాత్రివేళలో ఆహారం పరిమితం తీసుకోవడం చాలా ఉత్తమం అని న్యూట్రిషన్ నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవానికి లిమిట్ లేకుండా రాత్రి వేళలో భోజనం చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలుపుతున్నారు. డైట్ లో పక్కా ప్లాన్ చేసుకుంటే.. బరువు కూడా తగ్గిపోవచ్చని చెబుతున్నారు. రాత్రి వేళలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

శారీరక వ్యాయామాలు చేసినప్పటికీ  కొంత మంది బరువు తగ్గడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒకవేళ వ్యాయామం వంటివి చేస్తున్నప్పటికీ బరువు తగ్గడం లేదంటే.. డైట్ సరిగ్గా లేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. రాత్రివేళలో జాగ్రత్తలు పాటించకపోతే బరువు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా బరువు మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల వచ్చే అవకాశముందంటున్నారు. రాత్రి సమయంలో భోజనంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలని చాలా మందికి సందేహాలు కలుగుతుంటాయి. తొలుత ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండడం బెటర్. వీలు అయితే వాటిని పూర్తిగా మానేయాలి. పిండి పదార్థాలు రాత్రి భోజనంలో అస్సలు తీసుకోకూడదు. పప్పులు, కూరగాయలు,  తృణ ధాన్యాలు లాంటివి తీసుకోవచ్చు. అదేవిధంగా చేపలు, చికెన్, జున్ను వంటివి ప్రోటీన్లు కూడా తీసుకోవచ్చు. 

Advertisement

Also Read :   దీపారాధన చేసేటప్పుడు వత్తి ఏ వైపు ఉండాలో తెలుసా ?

Manam News

ప్రూట్ సలాడ్లు కూడా తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల  శరీరానికి ఫైబర్ అందుతుంది. ఇది పొట్టను శుభ్రంగా చేయడంలో ఉపయోగపడుతుంది. అల్పాహారం భోజనం కన్నా రాత్రి సమయంలో భోజనం చాలా తక్కువ తీసుకోవాలి. అసలు రాత్రివేళలో తక్కువగా ఎందుకు తినాలని న్యూట్రిషన్లు సూచిస్తారంటే.. మన జీర్ణక్రియ చాలా మంది షుగర్, ఊబకాయం వంటి వ్యాధులు వచ్చే అవకాశముంది. త్వరగా రాత్రి సమయంలో భోజనం చేయాలి. రాత్రి ఎనిమిది గంటలకు ముందే డిన్నర్ ముగించాలని నిపుణులు పేర్కొంటున్నారు. అనగా నిద్రించడానికి ముందే కనీసం మూడు గంటల ముందే డిన్నర్ చేయాలి. డిన్నర్ ఎప్పుడూ లైట్ గానే తీసుకోవాలి. త్వరగా తీసుకోవాలి. ముందుగానే ఫుడ్ రెడీగా ఉండేవిదంగా చూసుకోవాలి. ఆఫీస్ లో ఉన్నా.. ఇంట్లో ఉన్నా.. బయటికి వెళ్లినా డిన్నర్ ని త్వరగా పూర్తి చేసుకోవడం ఉత్తమం. 

Also Read : వాకింగ్‌ చేస్తే కూడా నష్టాలు ఉన్నాయి..బాగా నడిస్తే, ప్రమాదంలో పడ్డట్టే !

Visitors Are Also Reading