Ad
చాలా మంది అందం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు నిమ్మకాయలను ఉపయోగిస్తున్నారు. నిమ్మకాయలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే కొన్ని నష్టాలు కూడా ఉంటాయని నిపుణులు అంటున్నారు. నిమ్మకాయలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి . ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నిమ్మకాయ ఉపయోగాలపై ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
Advertisement
Advertisement
- నిమ్మకాయలో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ శరీరంలోని అసిడిటీ స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. వైరస్లు, బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా నిమ్మకాయ పనిచేస్తుంది. ఇందులోని విటమిన్ సీ కారణంగా రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.
- నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా అతిగా తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతక్షయం ఏర్పడుతుంది. ఇంకా దంతాల ఎనామిల్ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. దంతాలకే కాదు నిమ్మకాయల వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. ఎసిడిటీ ఉంటే నిమ్మకాయ తినడం వల్ల ఉబ్బరం, గుండెల్లో మంట కూడా కలుగుతుంది. నిమ్మకాయలో పొటాషియం ఎక్కువగా ఉండటం కారణంగా హార్ట్ బీట్ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
- మొటిమలను పోగొట్టడానికి, చుండ్రును వదిలించుకోవడానికి చాలా మంది నిమ్మకాయను ముఖం, తలకు అప్లై చేస్తారు. అయితే నిమ్మకాయను ఎక్కువగా ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది. దురద, మంట వంటి చర్మ సమస్యలకు కారణం అవుతుంది. అందుకే నిమ్మకాయను నేరుగా ముఖానికి రాసుకోకూడదని వైద్యులు అంటున్నారు. అదేవిధంగా బరువు తగ్గేందుకు కొందరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగుతుంటారు. దీని వల్ల చర్మం చాలా పొడిగా మారుతుంది. అలాగే ఎసిడిటీ వల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి అలాంటి అలవాట్లను తగ్గించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read : కిడ్నీ వ్యాధికి సంబంధించిన ఈ 8 లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి..!