సాధారణంగా చాలామందికి వ్యాయామం చేయడం అలవాటు. నిజంగా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా దృఢంగా, యాక్టివ్ గా, ఫిట్ గా కూడా ఉంటారు. అయితే వ్యాయామం చేసినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు కనిపిస్తే గుండె సమస్యలు ఉన్నట్లే అని గుర్తించాలి. ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా వర్కౌట్లు చేస్తుండగా గుండెపోటుతో మరణిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వర్కౌట్లు చేస్తుండగా గుండెపోటు వచ్చింది. ఈయన ఒక్కరే కాదు ఇటీవల కాలంలో జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా గుండెపోటుతో మరణించిన వారు చాలామంది ఉన్నారు. గుండె సమస్యలు ఉన్నాయన్న విషయం కూడా చాలామందికి తెలియదు .
వ్యాయామం చేస్తున్నాం కదా, ఆరోగ్యంగానే ఉంటాg అని అనుకుంటారు. కానీ వ్యాయామం చేసే సమయంలో గుండెపోటు వచ్చేముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలను గుర్తించి జాగ్రత్త పడితే గనుక గుండెపోటు నుండి బయట పడవచ్చు. వ్యాయామం చేసే సమయంలో కొన్ని లక్షణాల కారణంగా గుండె సమస్యలు వస్తాయి. మీరు వ్యాయామం చేసేటప్పుడు ఈ 6 లక్షణాలు కనిబడితే కనుక నీకు గుండె సమస్యలు ఉన్నట్లే.
Advertisement
వ్యాయామం చేసే సమయంలో ఎక్కువగా అలసట వస్తుంది. అలసట విపరీతంగా వస్తే గనుక మీకు గుండె సమస్య ఉన్నట్లే. బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాలను నిరోధించడానికి పని చేస్తుంది. ఇది రక్తపోటును ప్రభావితం చేస్తుంది. వ్యాయామం చేసే సమయంలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. చాతినొప్పి వస్తుంది. అసౌకర్యంగా ఉన్నప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకుంటే మంచిది. గుండె వేగం తగ్గిన తర్వాత వర్కౌట్ చేయడం మంచిది.
Advertisement
వ్యాయామం చేసే సమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది గుండె సమస్యకు కారణం అవుతుంది. కొన్ని సందర్భాల్లో హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఈ లక్షణం కనిపించినప్పుడు కాసేపు వర్కౌట్ ఆపాలి. గుండెపోటు వచ్చే ముందు ఛాతి నొప్పి వస్తుంది. వ్యాయామ సమయంలో ఛాతి నొప్పి వస్తుంటే కనుక గుండె సమస్యకు కారణంగా భావించాలి. ఈ విషయంలో అసలు తేలిగ్గా తీసుకోకూడదు. వ్యాయామం చేస్తున్న సమయంలో ఛాతినొప్పి గనక వస్తే వర్కౌట్ ఆపేయడం మంచిది. ఈ విషయంలో ఆలస్యం చేయకుండా నిపుణులను సంప్రదించాలి.
వ్యాయామం చేస్తున్నప్పుడు కొంతమంది డీహైడ్రేట్ కి గురవుతారు. ఈ సమస్య చాలా అధికంగా ఉంటుంది. ఈ సమయంలో శరీరంలో పొటాషియం, సోడియం, ఎలక్ట్రోలైట్లు కోల్పోతారు. ఈ కారణంగా హార్ట్ బీట్ సమస్య వస్తుంది. గుండెపోటు వచ్చే ముందు కళ్ళు తిరగడం, తల తిరిగినట్టు అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. వ్యాయామం చేస్తున్న సమయంలో ఈ లక్షణాలు కనిపిస్తే గనుక వెంటనే వర్కౌట్ మానేయాలి. వర్కౌట్ చేస్తున్న సమయంలో మీకు పై 6 లక్షణాలు కనిపిస్తే గనుక సంబంధిత నిపుణులను సంప్రదించాలి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
చిన్న వయస్సులో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తే అంత ప్రమాదమా..? నిపుణులు ఏమంటున్నారంటే ?