Home » పెళ్లి అంటే ఈ రాశుల వారు ప‌రుగెడ‌తారు.. కార‌ణం ఏమిటో తెలుసా..?

పెళ్లి అంటే ఈ రాశుల వారు ప‌రుగెడ‌తారు.. కార‌ణం ఏమిటో తెలుసా..?

by Anji

పెళ్లి అనేది జీవితంలో ఎంతో ముఖ్య‌మైన ఘ‌ట్టం ఒక వ‌య‌స్సు వ‌చ్చాక పెళ్లి కాక‌పోతే గుళ్లు, గోపురాలు అంటూ తిర‌గ‌డం భార‌త‌దేశంలో మ‌నం చూస్తూనే ఉన్నాం. దోషం పోవాల‌ని కొంద‌రు అభిషేకాలు కూడా చేయిస్తారు. కొన్ని రాశుల వారు మాత్రం పెళ్లి పేరు చెబితేనే చిరాకు ప‌డుతుంటారు. అప్పుడే పెళ్లి ఏమిటి అంటూ ఎదురు స‌మాధానం ఇస్తూ పెళ్లి నుంచి త‌ప్పించుకోవ‌డానికి చూస్తుంటారు. ఆ రాశుల వారు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

మిధున రాశి :

ఈ రాశి వారు చంచ‌ల‌బుద్ధితో ఉంటారు. ఒక‌ విష‌యంపై వీరు ఎప్పుడూ స్థిరంగా ఉండ‌రు. వేసుకునే చొక్కాల‌ను మార్చిన‌ట్టు వీరు త‌మ నిర్ణ‌యాలను మార్చుకుంటారు. ఒక వ్య‌క్తితో జీవితాంతం ఉండాల‌నుకోరు. ఈ ల‌క్ష‌ణాల‌తో వీరికి పెళ్లి అంటే అయిష్ట‌త ఉంటుంది.

సింహ రాశి :

ఈ రాశి వారికి పెళ్లిపై మంచి అభిప్రాయంతో ఉంటారు. వీరు థ్రిల్ కోరుకునే స్వ‌భావం క‌ల‌వారు. బోరింగ్‌గా ఉన్న‌ప్పుడు ప‌నులు చేయ‌డం అంటే వీరికి న‌చ్చ‌దు. వీరి దాంప‌త్య జీవితంలో గొడ‌వ‌లు వంటివి చేస్తే ఆ బంధం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు వెంట‌నే రెడి అవుతుంటారు.

కుంభ రాశి :

ఈ రాశి వారికి పెళ్లి అంటే బాధ్య‌త‌లు, స్వేఛ్చ‌ను హ‌రించే ఒక బంధం అనే ధోర‌ణిలో ఉంటారు. అందుకే వీరి ముందు పెళ్లి ప్ర‌స్తావ‌న‌ను తీసుకొస్తే కోప‌ప‌డుతారు. పెళ్లిని త‌మ కాళ్ల‌కు క‌ళ్లెం వేసే వ‌స్తువుగా వీరు భావిస్తారు.

మీన రాశి : 

పెళ్లి త‌రువాత వ‌చ్చే బ‌రువు బాధ్య‌త‌ల గురించి ఎక్కువ‌గా ఆలోచించే ర‌కం వీరు. లేనిపోనివి ఊహించుకుంటూ పెళ్లిపై ఓ చెడు అభిప్రాయాన్ని క‌లిగి ఉంటారు. వీరికి స‌మ‌స్య ఎదురైతే దానిని ఎదుర్కోకుండా పారిపోయే గుణముంటుంది. ఇదే వీరికి పెళ్లి అంటే ఓ రకం భ‌యాన్ని క‌లుగ‌జేస్తుంది.

Visitors Are Also Reading