సిరిసంపదలకు అధిదేవత లక్ష్మీదేవి. అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉందని చాలా మందికి తెలియదు. జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ అనుకుంటారు. అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం. ఆమె పేరు అలక్ష్మి. పాల సముద్రాన్ని మధించినప్పుడు కల్పవృక్షము, ఇంద్రుడి వాహనమైన ఐరావతం, లక్ష్మీదేవి, హాలాహలం, చివరిగా అమృత కలశంతో ధన్వంతరి అవతరించారు. పాలసముద్రం నుండి పుట్టిన లక్ష్మిని తాను వివాహం చేసుకోవాలని విష్ణువు భావిస్తాడు. అయితే తన సోదరి వివాహం జరిగిన తర్వాతే తాను చేసుకుంటానని అమ్మవారు తెలుపుతుంది. దీంతో అలక్ష్మికి తగిన వరుడు కోసం విష్ణువు ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు.
Advertisement
ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ఒప్పుకోరు. చివరికి ఉద్దాలక మహర్షి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. వివాహం తర్వాత ఉద్దాలక మహర్షి తో కలిసి అలక్ష్మీ ఆశ్రమానికి చేరుకున్న తర్వాత లోపలికి వెళ్లడానికి నిరాకరిస్తుంది. దీనికి కారణం ఏంటని ముని అడుగుతాడు. దీనికి అలక్ష్మి చెప్పిన సమాధానం ద్వారా ఆర్థిక వృద్ధి,ధననష్టం గురించి అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ఎప్పుడు గొడవలతో కొట్టుకునేవారు, పరిశుభ్రత లేని వారు , మత ఆచారాలకు విరుద్ధంగా ప్రవర్తించేవారిండ్ల లో మాత్రమే తాను ప్రవేశిస్తానని తెలుపుతుంది.
Advertisement
ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసుకుని సూర్యోదయానికి ముందే దైవారాధన చేసేవారింట్లో లక్ష్మి కొలువుంటుంది. అలక్ష్మికి వేడి, పుల్లని పదార్థాలంటే ఇష్టం. అందుకే ఇంటి ముందు మిరపకాయలు, నిమ్మకాయలు వంటి వాటిని వేలాడదీస్తారు. దీన్ని మూఢ నమ్మకంగా పేర్కొన్న కూడా ఇలా చేయడం వల్ల అలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించాలనుకున్నా కూడా తనకు ఇష్టమైన ఆహారాన్ని చూసి ఆగిపోతుంది. అలాగే లక్ష్మీదేవి పక్కన గుడ్లగూబ ఉండే ఫోటోను ఇంట్లో ఉంచకూడదు. దీని వల్ల ఆర్థికంగా నష్టపోవడం ఖాయం.
ఇది కూడా చదవండి:
బీజేపీలోకి రండన్నా అంటూ అభిమాని రిక్వెస్ట్…బండ్ల గణేష్ షాకింగ్ రిప్లై..!
ఈ తప్పులు చేయకుంటే కేజీఎఫ్-2 మరింత పెద్ద హిట్ అయ్యేదా..?