Home » ఆడవాళ్ళు ఇంట్లో ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి తిరిగివెళ్లి పోతుందట..!

ఆడవాళ్ళు ఇంట్లో ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి తిరిగివెళ్లి పోతుందట..!

by Sravanthi
Ad

పెద్దవాళ్ళు చెప్పిన మాటలను మనం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ మనం తెలిసీ తెలియక చేసిన పొరపాట్ల వల్ల ఇంట్లోకి రావాల్సిన లక్ష్మి రాకుండానే తిరిగి వెళ్ళిపోతుందట. సాయంత్రం పూట ఇంట్లో ఆడవాళ్లు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

ఇంటిని ఆకర్షణీయంగా ఉంచినప్పుడు సంపద, శ్రేయస్సు అనేది ఎప్పటికీ ఆ ఇంటిని వదిలి వెళ్ళవు. మీకున్న చిన్న చిన్న అలవాట్లే మీ అదృష్టాన్ని మార్చేస్తాయి. దురదృష్టాన్ని మరియు లక్ష్మీదేవికి కోపాన్ని తెచ్చిపెట్టే పనులు ఏంటో తెలుసుకుందాం. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తులసి చెట్టును ముట్టుకోవడం గాని పూజించడం గాని చేయకూడదు.

Advertisement

ఇలా చేస్తే దురదృష్టం, పేదరికం వెంటాడుతుంది. సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడ్వకూడదు. అలా చేస్తే సంపదను ఊడ్చేసినట్లు అవుతుందట. సూర్యాస్తమయం కాకముందే ఆడవాళ్లు ఇంటి పనులు పూర్తి చేసుకోవాలి. జుట్టు విరబోసుకుని తిరగకూడదు. సాయంత్రం పూట సంధ్యాసమయంలో ఎవరైనా ఇంటికి వచ్చి పాలు,పెరుగు అడిగితే ఇవ్వకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవిని మీరే స్వయంగా బయటికి పంపిన వారవుతారు.

అలాగే జుట్టు విరబోసుకుని పడుకోకూడదు. సాయంత్రం పూట ఉప్పును తీసుకొని పేపర్ లో చుట్టి మీ ఇంట్లోని ప్రతి గది లో వేయండి. తెల్లవారుజామున ఇంటి ఇల్లాలు ఎవరితో మాట్లాడకుండా వాటిని తీసి బయట పడేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది.

Visitors Are Also Reading