Home » శరీరంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే మీ కాలేయం పని ముగిసినట్టే..!!

శరీరంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే మీ కాలేయం పని ముగిసినట్టే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో కాలేయం అనేది చాలా ముఖ్యమైన పనితీరు వహిస్తుంది. ఇది శరీరంలోని జీవక్రియకు ఉపయోగపడుతుంది.. హానికరమైన టాక్సిన్స్ లను బయటకు పంపి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది.. అలాంటి కాలేయాన్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం.. కొంతమంది అధిక మద్యం, స్మోకింగ్ వంటివి చేసి కాలేయాన్ని పాడు చేసుకుంటున్నారు.. మరి కాలేయం దెబ్బతింటుందని తెలియజేసే ఐదు ముఖ్యమైన లక్షణాలను కూడా చూద్దాం..?

ALSO READ:Telangana: స్టూడెంట్స్ కు బ్యాడ్ న్యూస్.. దసరా సెలవులను తగ్గించనున్న ప్రభుత్వం..”SCERT” ఏమంటుందంటే..?

Advertisement

కామెర్లు: ఇది కాలేయం సంబంధించిన ప్రధానమైన సంకేతాలలో ఒకటి. మూత్రం పసుపు రంగులో మారడం.. రక్తంలో బిలిరుబిన్ స్థాయి పెరగడం, కాలేయ కణాలు నాశనం అవ్వడం వల్ల కామెర్లు సంభవిస్తాయి..


ఆకలి మందగించడం :కాలేయ సమస్యతో బాధపడేవారికి ఆకలి అనేది చాలా వరకు తగ్గుతుంది.. దీంతో పాటుగా వాంతులు అధిక వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఆకలి తగ్గడానికి ప్రధాన కారణం లెఫ్ట్ ఇన్ మరియు గ్రెలిన్ హార్మోన్ తగ్గడం.

Advertisement

వాపు : కాలేయం పాడయ్యే ప్రధానమైన సంకేతం ముఖం మరియు కాళ్ళలో వాపు.. పొత్తికడుపులో ద్రవం పేరుకుపోయి ప్రేగు యొక్క ఉపరితలం నుంచి ద్రవం లిక్ కావచ్చు. ఇది ఆసిటీస్ కు దారితీస్తుంది.


నిద్రలేమి :కాలేయ వ్యాధి గ్రస్తులు ముఖ్యంగా నిద్రలేమితో బాధపడతారు.. రక్తంలో పేరుకుపోయిన టాక్సిన్లు నిద్రకు భంగం కలిగిస్తాయని మరియు కొంతమంది రోగులు కోమాలోకి కూడా వెళ్లవచ్చని వైద్యులు అంటున్నారు..


కళ్ళు, నోరు పొడిబారడం :ఈ వ్యాధి సోకిన వారీ కళ్ళు మరియు నోరు పొడిబారడం కనిపిస్తుంది.. దీన్నే ప్రైమరీ బిలియరీ కొలంగిటీస్ అంటారు. ఇవి కేవలం ప్రైమరీ సంకేతాలు మాత్రమే.. ఇలాంటి సంకేతాలు మీకు కనిపిస్తే తొందరగా వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

ALSO READ:

Visitors Are Also Reading