Home » పెళ్లికి ముందున్న లవ్ స్టోరీస్ కాబోయే భార్యకు చెబితే ఏం జరుగుతుందో తెలుసా..?

పెళ్లికి ముందున్న లవ్ స్టోరీస్ కాబోయే భార్యకు చెబితే ఏం జరుగుతుందో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది  ఒక అపురూపమైనటువంటి ఘట్టం. తెలిసి తనకు తాను చేసుకునే మధుర జ్ఞాపకం. అలాంటి పెళ్లి విషయంలో  చేసుకునే ముందు అనేక జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలంటారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ బ్యాగ్రౌండ్ గమనించి  పెళ్లిళ్లు చేసుకుంటే సుఖ జీవనం ఉంటుందని తెలియజేస్తున్నారు.

Advertisement

అయితే పెళ్లికి ముందే కొంతమంది లవ్ స్టోరీస్ ఉంటాయి.  కానీ వారు ప్రేమించిన వారిని కాకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. అలా పెళ్లి చేసుకున్న కొత్త అమ్మాయికి,  అబ్బాయికి  మీ పాత లవ్ స్టోరీస్ చెబితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

అయితే పెళ్లికి ముందే కొంతమంది  కాబోయే జీవిత భాగస్వాములతో ఓపెన్ గా ఉండాలని అన్ని చెబుతారు. ఇలా చెప్పే ముందు ఒకటి ఆలోచించాలి. మీ జీవిత భాగస్వామికి ఈ విషయం చెప్పే ముందు  మీ లవ్ ఎందుకు బ్రేకప్ అయిందో  వారికి క్లియర్ గా తెలియజేయాలి.  అంతేకాకుండా మీరు ఈ విషయం చెబితే మీ లైఫ్ పార్టనర్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందో కూడా అర్థం చేసుకొని విషయాలు చెప్పాలి.

Advertisement

ఒకవేళ వారు అర్థం చేసుకుంటే ఓకే కానీ, సరిగా రిసీవ్ చేసుకోకపోతే మాత్రం లేనిపోని అనుమానాలు పెరుగుతాయి. ఒకవేళ వారే మిమ్మల్ని లవ్ ఎఫైర్లు ఉన్నాయా అని అడిగితే  దాని గురించి క్లియర్ గా చెప్పండి. తనకు అర్థం అయ్యేలా  తెలియజేయండి. ఒకవేళ మీ విషయాలను అర్థం చేసుకుంటే ఓకే కానీ అర్థం చేసుకోకపోతేనే లైఫ్ ట్రాక్ తప్పుతుంది.

మరికొన్ని ముఖ్య వార్తలు:

 

Visitors Are Also Reading