Home » పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఎవ‌ర‌నేది ఉత్కంఠ‌.. ఆ ప్లేయర్‌ని ఎన్నుకుంటే జీరో నుంచి ప్రయాణించాల్సిందే..!

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఎవ‌ర‌నేది ఉత్కంఠ‌.. ఆ ప్లేయర్‌ని ఎన్నుకుంటే జీరో నుంచి ప్రయాణించాల్సిందే..!

by Anji
Ad

పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శిఖ‌ర్ దావ‌న్‌ను నియ‌మిస్తారని నివేదిక‌లు సూచిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ య‌జ‌మాని మోహిత్ బ‌ర్మ‌న్ మ‌రొక విధంగా హింట్ ఇచ్చాడు. స్పోర్ట్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బ‌ర్మ‌న్ మాట్లాడారు. ఇంత‌కు ముందు ఆడిన సీనియర్ ఆట‌గాడు జ‌ట్టును న‌డిపించ‌డంలో అంత పెద్ద ప్ర‌యోజ‌నం అని నేను భావిస్తున్నాను. మ‌యాంక్ అగ‌ర్వాల్ అర్ష‌దీప్‌సింగ్‌ల‌ను వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ కేవ‌లం ఇద్ద‌రూ ఆట‌గాళ్ల‌ను మాత్ర‌మే రిటైన్ చేసుకుంది.

Advertisement

కే.ఎల్‌. రాహుల్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్‌గా సైన్ ఆప్ చేసిన త‌రువాత కొత్త కెప్టెన్ పై ప్ర‌శ్న త‌లెత్తింది. ఫిబ్ర‌వ‌రి 12, 13 తేదీల‌లో బెంగ‌ళూరులో నిర్వ‌హించిన వేలంలో పంజాబ్ కింగ్స్ శిఖర్ దావ‌న్ ను 10 మార్క్యూ ప్లేయ‌ర్ల జాబితా నుంచి రూ.8.25 కోట్ల‌కు రిటైన్ చేసింది. పంజాబ్ కింగ్స్ జ‌ట్టు సీనియ‌ర్ ఎంతో అనుభ‌వ‌జ్ఞుడైన భార‌త ఓపెన‌ర్‌ను కెప్టెన్‌గా చేయ‌నున్న‌ద‌ని వార్త‌లు వినిపించాయి. ప్ర‌స్తుతం ధ‌వ‌న్ స్థానంలో మ‌యాంక్ చేరాడు.

Advertisement

మా వ్యూహం ఏమిటంటే.. చాలా బ‌ల‌మైన లెప్టినెంట్ల‌ను ప్ర‌తిస్థానంలో ఉంచ‌డం, త‌ద్వారా కెప్టెన్‌కు నాయ‌క‌త్వం వ‌హించ‌డం చాలా సుల‌భం అవుతుంది. ఎవ‌రి ప‌ని వారు స‌క్ర‌మంగా చేస్తున్నప్పుడు సార‌థి ఎవ‌ర‌న్నది ఎవ‌రూ ప‌ట్టించుకోరు. కాబ‌ట్టి నేను బ‌ల‌మైన జ‌ట్టుగా క‌నిపించే స‌మాన‌మైన ప్లేయింగ్ సైడ్ ఇవ్వాల‌నుకుంటున్నానని ఆయ‌న తెలిపారు. 2014లో ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. ఈ జ‌ట్టులోనే కాకుండా కుర్రాళ్ల‌తో ఎద‌గ‌గ‌ల ఆత్మ‌విశ్వాసాన్ని నింప‌గ‌ల కెప్టెన్‌లో కూడా స‌మ‌తుల్య‌త చూస్తుంది. మెగావేలంలో పంజాబ్ కింగ్స్ టాప్ పెర్పార్మ‌ర్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది. శిఖ‌ర్ ధావ‌న్‌, జానీ బెయిర్ స్టో, లియామ్ లివంగ్ స్టోన్‌, ఓడియ‌న్ స్మిత్‌, షారూఖ్ ఖాన్‌ల‌లో కూడిన బ్యాటింగ్ లైన‌ప్‌ను పొంద‌గలిగారు. కగిసో ర‌బ‌డా ప్ర‌పంచ క్రికెట్‌లో అత్యుత్త‌మ బౌల‌ర్ల‌లో ఒక‌డిగా నిలిచాడు.

Also Read :  సుమ‌న్ జైల్లో ఉన్న‌ప్పుడు అండ‌గా నిలిచిన ముగ్గురు హీరోయిన్లు..!

మెగావేలంలో 10 జ‌ట్లు ఉండ‌డంతో చాలా గంద‌ర‌గోళానికి గుర‌య్యాం. వాస్త‌వానికి మేము సానుకూలంగా ప్రారంభించ‌డం మా అదృష్టంగా భావించాం. ఎందుకంటే మేము మా మొద‌టి ఆట‌గాళ్లైన శిఖ‌ర్ ధావ‌న్‌, ర‌బాడ‌ల‌ను పొంద‌గ‌లిగాం. మ‌యాంక్‌తో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా శిఖ‌ర్ ఎంపిక‌య్యాడు. బౌలింగ్ ఎటాక్‌ను న‌డిపించే బౌల‌ర్‌గా ర‌బాడా చేరాడు. తొలి రౌండ్‌లోనే మొద‌టి ఎంపిక‌ల‌ను రెండింటిని పొంద‌గ‌లిగాం. త‌రువాత రౌండ్ల‌లో ఇది మాకు సుల‌భ‌త‌రం చేసింద‌ని మోహిత్ బ‌ర్మ‌న్ వెల్ల‌డించారు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా మ‌యాంక్ అగ‌ర్వాల్‌ను నియ‌మిస్తే టీమ్ జీరో నుంచి మొద‌లు పెట్టనుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. కెప్టెన్ ఎవ‌రినీ నియ‌మిస్తార‌నేది చూడాలి.

Also Read :  Ranji Trophy 2022: ఫ‌స్ట్ క్లాస్ ఆరంగేట్రంలో స‌కీబుల్ ప్ర‌పంచ రికార్డు.. ఈ జాబితాలో ఇంకా ఎవ‌రున్నారంటే..?

Visitors Are Also Reading