IPL 2021 లో PBKS V/s RR ల మద్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో లివింగ్ స్టోన్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు….అప్పుడు ఆ మ్యాచ్ కి కామెంట్రీ చేస్తున్న గౌతమ్ గంభీర్ ఒక కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చాడు. బ్యాట్స్ మెన్ 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం బాల్ ను కొట్టినప్పుడు దాన్ని సిక్స్ (6) గా కాకుండా ఎయిట్ (8) గా పరిగణించాలన్నాడు. T20 లో వచ్చిన అనేక మార్పులకు IPL యే కారణం అన్నాడు…..ఈ నియమాన్ని కూడా IPL నుండే స్టార్ట్ చేయాలని సూచించాడు.
Advertisement
Advertisement
ఆ సందర్భంగా ఈ ప్రతిపాదనపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. మరో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కూడా దీన్ని సమర్థించాడు. చాలా మంది ఈ ప్రతిపాదనను వ్యతిరేఖించారు. ఇప్పటికే క్రికెట్ బ్యాట్స్ మెన్స్ గేమ్ గా మారిపోయిందని….ఇదే జరిగితే ఇక క్రికెట్ అంటే కేవలం బ్యాటింగ్ మాత్రమే అన్నట్టే మారిపోతుందనే విమర్శలు వచ్చాయి.
అదే సందర్భంలో…..90 మీటర్లు కొడితే 8 రన్స్ ఇచ్చినట్టే….. క్లీన్ బౌల్డ్ అయితే రెండు వికెట్స్ ఇస్తారా? లేక టీమ్ స్కోర్ నుండి 10 రన్స్ తగ్గిస్తారా? లేదా నెక్ట్స్ ఏ బ్యాట్స్ మెన్ రావాలో అనే ఆప్షన్ ను సదరు బౌలర్ కు ఇస్తారా? అనే టాపిక్స్ కూడా నడుస్తున్నాయ్.!