స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ ఎంతటి ఘనవిజయం అందుకొని ముందుకు పోతుందో మనందరికీ తెలుసు. జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి తొలిసారి దర్శకత్వం వహించిన ఈ మూవీకీ మంచి ఆదరణ లభిస్తుంది. తెలంగాణ మారుమూల గ్రామాల్లో కూడా ఈ చిత్రం గురించే ప్రజలు మాట్లాడుకుంటున్నారంటే ఈ మూవీ ప్రజలకు ఎంత కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రియదర్శి కావ్య ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో తెలంగాణ యాస, భాష,సాంప్రదాయాలు అన్ని కలగలిపి పల్లెటూరి బంధాలు,బంధుత్వాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు వేణు.
also read:గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చిరు హీరోయిన్ ! ఇప్పుడెలా ఉందొ చూసి షాకవుతున్న ఫ్యాన్స్
Advertisement
Advertisement
ప్రస్తుతం ఈ సినిమా తెలంగాణ వ్యాప్తంగా వ్యాపించింది. చాలా గ్రామాల్లో దండోరా వేసి మరీ ప్రదర్శిస్తున్నారు. గ్రామాల్లో ఉండే మెయిన్ సెంటర్ ల వద్ద రచ్చబండల వద్ద ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. దీంతో ఇది కాస్త వివాదంగా మారింది. ఈ చిత్రం డిజిటల్ హక్కులని అమెజాన్ సంస్థ సొంతం చేసుకుంది. అమెజాన్లో మార్చి 24 నుంచి ఈ చిత్రం స్త్రీమ్ అవుతుంది. ఈ నేపథ్యంలో తమ చిత్రాన్ని గ్రామాల్లో అక్రమంగా ఉచిత ప్రదర్శనలు చేయడం వల్ల తమకి భారీ నష్టం అంటూ దిల్ రాజు పోలీసులని ఆశ్రయించారు.
also read:టైలర్ తప్పుగా ప్రవర్తిస్తే.. పల్సర్ బైకు ఝాన్సీ తండ్రి ఏమన్నాడో తెలుసా ?
అక్రమ ప్రదర్శనలు అడ్డుకోవాలని దిల్ రాజ్ టీం నిజాంబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బలగం చిత్రాన్ని పల్లెటూరి ప్రజలకు అక్రమంగా ప్రదర్శిస్తున్న వారి పట్ల చర్యలు తీసుకోవాలని కోరారు. మరి దీనిపై పోలీసులు ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఏది ఏమైనా ఒక చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ ఇంతటి ఆదరణ లభించడంతో చిత్ర యూనిట్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
also read:ఆ డాక్యుమెంట్స్ పై 2సంతకాలే.. కాస్ట్యూమ్ కృష్ణ కొంపముంచాయా..?