Home » అశ్విన్ పై ఐస్‌లాండ్ క్రికెట్ ప్రశంసలు..!

అశ్విన్ పై ఐస్‌లాండ్ క్రికెట్ ప్రశంసలు..!

by Azhar
Ad

భారత క్రికెటర్లలో అందరికంటే ఎక్కువగా క్రికెట్ నియమాల గురించి తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రవిచంద్రన్ అశ్విన్. అయితే ఐపీఎల్ లో బట్లర్ ను అశ్విన్ మాన్కడింగ్ చేయడం ద్వారా దానిపైన మొదలైన చర్చ మూడేళ్లు ఆగకుండా సాగింది. ఆ దెబ్బకు ఐసీసీ ఈ నియమనే మార్చేసింది.

Advertisement

అయితే ఇప్పుడు అశ్విన్ పై ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు కూడా ప్రశంసలు కురిపించింది. ఎందుకంటే.. నిన్న ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ – ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో అశ్విన్ చేసిన బౌలింగ్ అందుకు కారణం. మాములుగా బౌలర్లు ఎవరైనా… లైన్ ను తొక్కుతూ బౌలింగ్ చేస్తారు. కానీ అశ్విన్ మాత్రం ఆ లైన్ కు చాలా దూరంగానే ఉంటూ బౌలింగ్ చేసాడు.

Advertisement

దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ… క్రికెట్ అనేది 22 గజాల దూరంతో ఆడే ఆట అని ఎవరు చెప్పారు? ఇక్కడ… అశ్విన్ ను చుడండి. అతను బంతిని ఎక్కువ సేపు గాల్లో ఉంచేందుకు… లైన్ కు దూరంగా ఉంటూ బౌలింగ్ చేస్తున్నాడు. అందువల్ల బంతికి ఎక్కువ స్పిన్ మరియు లెంగ్త్ దొరుకుతుంది. ఈ షార్ట్ ఫార్మాట్ క్రికెట్‌లో బౌలర్‌కు చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి సరైన మార్గంలో కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం అనేది ఎంతో ముఖ్యం” అంటూ ఐస్‌లాండ్ క్రికెట్ పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

కుల్దీప్ విజయం వెనుక ఉన్నది అతనే…!

పృథ్వీ షాకు జరిమానా.. ఎందుకంటే..?

Visitors Are Also Reading