Home » నాకు అహంకారం లేదు.. అందరినీ కలుస్తా.. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

నాకు అహంకారం లేదు.. అందరినీ కలుస్తా.. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

by Anji
Ad

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై ఎల్బీ స్టేడియం వేదికగా పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. గత పాలకులు సామాన్యులను కలిసేందుకు ఇష్టపడలేదన్నారు. కానీ తాను సీఎం హోదాలో ఉన్నప్పటికీ అందరినీ కలుస్తానని, ఎవరు పిలిచిన పలుకుతానని చెప్పారు.  ఈ మేరకు తెలంగాణలో చేపట్టిన అధ్యాపక, ఉపాధ్యాయ, మెడికల్‌, కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల్లో భాగంగా.. నియామక పత్రాలు జారీ చేసే కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఉద్యోగాలు సాధించినవారికి సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా నిమామక పత్రాలు అందజేశారు.

CM REVANTH REDDY

CM REVANTH REDDY

 తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలిచ్చామన్నారు. విద్య మీద పెట్టేదాన్ని ఖర్చుగా చూడకూడదని సూచించారు. గత ప్రభుత్వంలో 6 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి విద్యా వ్యవస్థను నాశనం చేయాలని చూశారంటూ మండిపడ్డారు. ప్రజల కళ్లలో ఆనందం చూసేందుకు ఈ మీటింగ్ పెట్టామని, తాను సామాన్య ప్రజానికానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మాటిచ్చారు.

Advertisement

Advertisement

గత ప్రభుత్వం ఫామ్ హౌస్ మత్తులో ఉండి నిరుద్యోగ సమస్యలను పట్టించుకోలేదు అన్నారు.  ప్రశ్నాపత్రాలు ఏ జిరాక్స్ సెంటర్ లో బయట పడతాయో తెలియని పరిస్థితి ఉండేది. ముఖ్యంగా నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేదు. ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను.  గుంటూరు, గుడివాడల్లో చదువుకొని వచ్చిన వాళ్ళు నాకు ఇంగ్లీషు రాదని ఎగతాళి చేస్తున్నారు అని పేర్కొనడంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.

Also Read :  మంచు విష్ణు కన్నప్ప మూవీలో సాంగ్స్ కోసం ప్రభుదేవా..?

 

Visitors Are Also Reading