Telugu News » Blog » కన్న తండ్రే కాల యముడైతే.. ఐ హేట్ మై డాడ్.. అందుకే చనిపోతున్నా..?

కన్న తండ్రే కాల యముడైతే.. ఐ హేట్ మై డాడ్.. అందుకే చనిపోతున్నా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

నాన్న ప్రపంచ దేశాలలో ఎక్కడ చూసినా నాన్న ప్రేమ కొడుకుల మీద కంటే కూతుర్ల మీద ఎక్కువగా ఉంటుంది. అలాగే కూతుర్లకు కూడా అమ్మ కంటే నాన్న అంటేనే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. నాన్న ఏది అడిగినా క్షణాల్లో కూతుర్లకు తెచ్చి ఇస్తూ ఉంటారు. అంతటి ప్రేమానురాగాల బాండింగే తండ్రీ కూతుర్ల మధ్య ఉంటుంది. అలాంటి నాన్న కూతురి పాలిట కాల యముడు అయితే ఆ కూతురు ఏం చేస్తుంది. ఎవరికి చెప్పుకుంటుంది. చివరికి తండ్రి టార్చర్ భరించలేక ఐ హేట్ మై డాడీ అని లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది ఆ మైనర్ బాలిక. మరి అది ఎక్కడో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం..?రేపు పదో తరగతి పరీక్షలు మొదలవుతాయి అనగా అందరూ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు. కానీ అమ్మాయి దూలానికి ఉరి వేసుకొని వేలాడుతోంది. దానికి ప్రధాన కారణం ఆ మైనర్ బాలిక తండ్రి. నందిగామ మండలం లోని ఉగ్గాని గూడలో మొగిలిగిద్ద నరసింహ దంపతులకు కుమారుడు శ్రవణ్, కుమార్తె మనీషా ఉన్నారు. మనీషా ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. అయితే మీ తల్లి లలిత ఏడాది క్రితం అనారోగ్యంతో మరణించింది. ఇక అప్పటి నుంచి నరసింహా తాగుడుకు బానిస అయిపోయాడు. ప్రతి రోజూ తాగి వచ్చి కుమారుడు మరియు కుమార్తె తో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో కుమారుడు తాను పనిచేసే దగ్గర ఉంటున్నాడు. దీంతో నరసింహ రోజూ తాగి వచ్చి తన కూతురును మరింత వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు తిడుతూ, కొడుతూ పలు రకాలుగా హింసించేవారు. ఇలా తండ్రి వేదింపులు ఎక్కువ అవుతుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మనీషా దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుంది. మధ్యాహ్నం వచ్చి చూసిన తండ్రి కుమారుడు శ్రవణ్ కి ఫోన్ చేసి ఇంట్లో చెల్లెలు ఉరివేసుకుని అని చెప్పాడు. శ్రావన్ చెప్పిన సమాచారం ప్రకారం పోలీసులు పచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. తండ్రి వేధింపులు భరించలేక అవమానాన్ని తట్టుకోలేక చెల్లి మరణించిందని శ్రవణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఘటనా స్థలంలో లభించిన టువంటి నోట్బుక్లో తన ఆత్మహత్యకు గల కారణాలను మనీశా స్పష్టంగా రాసింది. ఐ హేట్ మై డాడీ అని నాలుగు సార్లు మా నాన్న మంచివాడు కాదు దరిద్రుడు అని గలీజ్ గాడు, నాన్న అని పిలవాలి అంటే కూడా చాలా అసహ్యం వేస్తుంది అని నాన్న ను చంపాలని ఉంది. లేదా నేనన్న చావాలని ఉంది. ఐ యాం వెయిటింగ్ ఫర్ డెత్ అని రాసిన లేఖ లభించింది.

Advertisement

Advertisement

ALSO READ;

ఒకే ప్రేమ్ లో టాప్ హీరోయిన్లు.. నెటిజ‌న్లు ఏమంటున్నారంటే..?

య‌మ‌లీల సినిమా నుండి త‌ప్పుకునేలా సౌంద‌ర్య‌ను భ‌య‌పెట్టింది ఎవ‌రో తెలుసా..?

 

Advertisement

You may also like