Home » హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ ల ఫస్ట్ రెమ్యునరేషన్ అంత తక్కువా…?

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ ల ఫస్ట్ రెమ్యునరేషన్ అంత తక్కువా…?

by AJAY
Ad

జబర్దస్త్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో హైపర్ ఆది, సుడిగాలి సుదీర్ కూడా ఉంటారు. ప్రస్తుతం వీరిద్దరూ ఒకవైపు బుల్లితెరపై రాణిస్తూనే మరోవైపు వెండితెరపై కూడా అవకాశాలను అందుకుంటున్నారు. సుధీర్ అయితే ఏకంగా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. హైపర్ ఆది సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ బిజీగా మారిపోయాడు. అయితే ఈ స్థాయికి ఎదగడానికి మాత్రం హైపర్ ఆది, సుధీర్ లు ఎంతో కష్టపడ్డారు.

Advertisement

సుధీర్ కెరీర్ ప్రారంభంలో మ్యాజిక్ షోలు చేస్తూ డబ్బులు సంపాదించేవాడు. ఈవెంట్లతోపాటు టీవీ షోలలో సుధీర్ మ్యజిక్ షోలు చేసేవాడు. ఇక సుధీర్ జబర్దస్త్ టీవీ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా టీం లీడర్ స్థాయికి ఎదిగాడు. జబర్దస్త్ లో సక్సెస్ అయిన తర్వాత పలు టీవీ షోలో ఆఫర్లు అందుకున్నాడు.

Advertisement

నిజానికి వీరిద్దరి మొదటి రెమ్యునరేషన్ తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే. సుధీర్ కు జబర్దస్త్ లో కొత్తలో ఒక్కో స్క్రిప్ట్ రాసినందుకు గాను కేవలం 2000 రూపాయల రెమినరేషన్ ను ఇచ్చేవారట. అంతేకాకుండా హైపర్ ఆదికి సైతం ఒక్కో స్క్రిప్ట్ రాసినందుకు ఎపిసోడ్ కు 2000 రూపాయలు ఇచ్చేవారట. కానీ ప్రస్తుతం వీరిద్దరూ ఒక్కో ఎపిసోడ్ కు లక్ష వరకు తీసుకుంటున్నారు. అయితే వీరిద్దరూ కూడా జబర్దస్త్ నుండి ఇతర టీవీ షోలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

Visitors Are Also Reading