Home » జబర్దస్త్ ద్వారా హైపర్ ఆది ఎంత సంపాదించాడో తెలుసా…?

జబర్దస్త్ ద్వారా హైపర్ ఆది ఎంత సంపాదించాడో తెలుసా…?

by AJAY
Published: Last Updated on
Ad

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమందికి లైఫ్ వచ్చింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చినవాళ్ళు జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత కమెడియన్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం టివి లో సినిమాల్లో ఫుల్ బిజీగా మారిపోయారు. అలా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. హైపర్ ఆది జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వకముందు సాప్ట్ వేర్ ఉద్యోగం చేసేవాడు.

Jabardasth Actor Hyper Aadi Remuneration, Salary, Net Worth

ఇవి కూడా చదవండి: పేరు మార్చుకున్న చిరంజీవి…! కారణం అదేనా…?

Advertisement

Hyper Aadi

అంతే కాకుండా ఆది హైదరాబాద్ వచ్చే ముందు తమకు ఉన్న పదహారు ఎకరాల పొలాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. అంతే కాకుండా 20 లక్షల రూపాయల అప్పు కూడా ఉండేది అట. ఇక హైపర్ ఆది మొదట ఇతరుల స్కిట్స్ లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత తన పంచ్ టైమింగ్ తో ఏకంగా టీమ్ లీడర్ గా ఎదిగాడు. హైపర్ ఆది అతితక్కువ కాలం లోనే టీమ్ లీడర్ గా ఎదిగి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక టీమ్ లీడర్ గా కూడా ఎంతో సక్సెస్ అయ్యాడు. తన కామెడీ తో ప్రేక్షకుల ను జడ్జిల ను ఫిదా చేశాడు. ఇక జబర్దస్త్ ద్వారా మరియు టివి షోల ద్వారా హైపర్ ఆది భారీగానే సంపాదించినట్టు తెలుస్తోంది. ఆది ఒక్కో స్కిట్ కు అప్పట్లో లక్ష వరకూ తీసుకునేవారట.

Advertisement

Hyper Aadi net worth

ఇవి కూడా చదవండి: ఆధార్ సంస్థ‌ కీల‌క నిర్ణ‌యం.. ఇక నుంచి వాటితో కూడా లింక్..!

Hyper aadi net worth

Hyper aadi net worth

అంతే కాకుండా ఇతర టివి షోలు మరియు సినిమాల ద్వారా కూడా భారీగానే సంపాదించాడని టాక్ ఉంది. తాను హైదరాబాద్ కు వచ్చే ముందు అమ్మేసిన పదహారు ఎకరాల పొలాన్ని తిరిగి కొనుగోలు చేశాడట. అంతే కాకుండా తన తండ్రికి ఉంగరాలు పెట్టుకోవడం అంటే ఇష్టమట. దాంతో ఆది పది వ్రేళ్లకు పది ఉంగరాలను కొనిచ్చాడట. ఇదిలా ఉండగా హైదరాబాద్ లోనూ ఒక భారీ బంగళాను ఆది కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆది జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెల్సిందే.

ఇవి కూడా చదవండి: విహారి ఆ క్యాచ్ ప‌ట్టి ఉంటే మ్యాచ్ మ‌రోలా ఉండేది.. నెటిజ‌న్ల కామెంట్స్ వైర‌ల్‌..!

Visitors Are Also Reading