Telugu News » Blog » భార్య‌, భ‌ర్త‌, విడాకులు, బ్యాగ్ నిండా చిల్ల‌ర‌! ఇంట్ర‌స్టింగ్ స్టోరి!!

భార్య‌, భ‌ర్త‌, విడాకులు, బ్యాగ్ నిండా చిల్ల‌ర‌! ఇంట్ర‌స్టింగ్ స్టోరి!!

by Azhar

 పంజాబ్‌కు చెందిన భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య‌ వివాదాలు రావ‌డంతో విడాకుల కోసం వారు కోర్ట్ కు వెళ్లారు. ఇద్ద‌రి వాద‌న‌లు విన్న కోర్ట్ ఆ జంటకు విడాకులు మంజూరు చేస్తూ భ‌ర్త ప్ర‌తి నెల‌ 25 వేల రూపాయ‌ల‌ను భార్య‌కు భ‌ర‌ణంగా చెల్లించాల‌ని తీర్పునిచ్చింది. మొద‌ట నిరాక‌రించిన భ‌ర్త త‌ర్వాత నెల‌కు 25 వేల రూపాయ‌ల‌ను భ‌ర‌ణంగా ఇవ్వ‌డానికి ఒప్పుకున్నాడు.

Ads

Ads

 

భ‌ర‌ణం ఇవ్వాల్సిన స‌మ‌యం రానే వ‌చ్చింది. స‌ద‌రు వ్య‌క్తి విడాకులిచ్చిన త‌న భార్య ఇంటికి ఓ బ్యాగ్ ను పంపించాడు.ఆ బ్యాగ్ లో మొత్తం 25వేల రూపాయ‌లున్నాయి. విచిత్రం ఏంటంటే….ఆ 25 వేల రూపాల‌య‌ల‌న్నీ చిల్ల‌ర రూపంలో ఉన్నాయి. 25వేల రూపాయ‌ల్లో 24,600ల‌ను చిల్ల‌ర నాణేల రూపంలో ఇచ్చాడు. అన్నీ రూ.1, రూ.2, రూ.5 నాణేలు.

భార్య మ‌ళ్లీ కోర్ట్ కు వెళ్లింది. త‌న భ‌ర్త  కావాల‌నే త‌న‌ను చిల్ల‌ర ఇచ్చి వేధిస్తున్నాడ‌ని ఆరోపించింది. ఈ సారి తీర్పు చెప్పిన కోర్ట్ డ‌బ్బులు ఏవైనా డ‌బ్బులే అవి నోట్లైనా, చిల్ల‌ర అయినా మీరు తీసుకోవాల్సిందేన‌ని  చెప్పింది.