Telugu News » Blog » భార్య కు భర్త పై అనుమానం రావడానికి 5 కారణాలు ఇవేనట…!

భార్య కు భర్త పై అనుమానం రావడానికి 5 కారణాలు ఇవేనట…!

by AJAY
Ads

భార్య భర్తల బంధం అనేది ఎంతో ప్రత్యేకమైనది. కలకాలం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని ఒట్టు పెట్టుకుని మరి వివాహం చేసుకుంటారు. అయితే కొన్ని కారణాలవల్ల ఎంతో అన్యోన్యంగా గడపాలనుకున్న వివాహ బంధాలు కూడా విచ్చినమైపోతున్నాయి. అందులో అనుమానం అనేది పెనుభూతం గా మారింది. కాగా భార్యలు తమ భర్తలపై అనుమానం పెంచుకునేందుకు కొన్ని కారణాలు ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.

Ads

దానివల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం….. భర్త ఇతర స్త్రీలతో అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడటం వల్ల భార్యకు అనుమానం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి ఇతర స్త్రీలతో భర్తలు ఎక్కువ చనువుగా ఉండటం మంచిది కాదని చెబుతున్నారు.

Ads

అంతేకాకుండా పెళ్లికి ముందు ఎంతో ప్రేమగా చూడటం చక్కగా మాట్లాడటం చేసిన భర్త పెళ్లి తర్వాత పట్టుమని పది నిమిషాలు కూడా తమతో ప్రేమగా మాట్లాడకపోవడం కూడా అనుమానాలకు దారితీస్తుందని చెబుతున్నారు. భర్తలు అలా ప్రవర్తిస్తే మరో స్త్రీతో ఏమైనా సంబంధం కూడా సాగిస్తున్నాడా అని అనుమానాలు వస్తాయని చెబుతున్నారు. ఎక్కువ సమయం ఫోన్లో గడిపినా కూడా భార్యలకు అనుమానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

Ad

కొంతమంది గంటల పాటు ఫోన్లో గడుపుతారని దానివల్ల భార్యలకు అనుమానాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. భర్తలు తమ మాజీ ప్రియురాలి గురించి మాట్లాడటం ఆమె గురించి భార్యా దగ్గర చెప్పడం వల్ల కూడా అనుమానాలు మొదలవుతాయని…కాబట్టి భార్య వద్ద ఇతర స్త్రీలకు ప్రస్తావన తీసుకురావద్దని చెబుతున్నారు. ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండక పోతే కాపురాలు కూడా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.