Home » హరిహర వీరమల్లుకు హిందీ నుండి భారీ ఆఫర్స్..!

హరిహర వీరమల్లుకు హిందీ నుండి భారీ ఆఫర్స్..!

by Azhar
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఉన్నారు అనే చెప్పాలి. ఎందుకంటే.. టాలీవుడ్ లో ఏ హీరోకు లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఉన్నటుండి రాజకీయాల కోసం సినిమాల నుండి తప్పుకున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు అయితే ప్రకటించారు.. కానీ షూటింగ్ మాత్రం ఆలస్యం అవుతుంది అనే చెప్పాలి.

Advertisement

ఇక ఇప్పటివరకు ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో కేవం రెండు సినిమాలే రిలీజ్ చేసిన పవన్.. ప్రస్తుతం తన మూడో సినిమా హరిహర వీరమల్లు పైకా ఫోకస్ అనేది పెట్టాడు. అయితే చాలా రోజులుగా వాయిదా వేస్తూ వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు పూర్తి చేయడానికి సిద్ధం అయ్యాడు పవన్. ఇక డైరెక్టర్ క్రిష్ కూడా ఈ పనిలోనే ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి చిన్న గ్లిమ్స్ అనేది విడుదల చేసారు.

Advertisement

అయితే ఈ గ్లిమ్స్ వల్ల హరిహర వీరమల్లు సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చినట్లు తెలుస్తుంది. అందుకే ఈ సినిమాకు ఆఫేసర్లు అనేవి మొదలయ్యాయట. ముఖ్యంగా ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో వస్తుండటంతో.. దీనికి హిందీలో కూడా ఆఫర్స్ భారీగానే వస్తున్నాయి అని తెలుస్తుంది. కాబట్టి ఈ సినిమా విడుదలకు ముందే భారీ బిజినెస్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ నోరు మూయించిన ఇర్పాన్ పఠాన్..!

టాస్ సమయంలో రవిశాస్త్రి ఆగం..!

Visitors Are Also Reading