Home » హృతిక్ రోషన్ ‘విక్రమ్ వేద’ ఫస్ట్ లుక్

హృతిక్ రోషన్ ‘విక్రమ్ వేద’ ఫస్ట్ లుక్

by Anji
Ad

గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ త‌రువాత మూవీ విక్ర‌మ్ వేద హిందీ రీమేక్ పై ఇప్పుడు ఆయ‌న అభిమానుల దృష్టి ఉన్న‌ది. ఈ చిత్రానికి సంబంధించిన స్టార్ కాస్ట్ ఇప్ప‌టికే అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తించింది. ఈ మూవీ అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా.. మేక‌ర్స్ తొలుత హ‌తిక్ రోజు పుట్టిన రోజు సంద‌ర్భంగా వేద‌గా ఆయ‌న పాత్ర‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. తాజాగా విక్ర‌మ్ వేద హిందీ రీమేక్ నుంచి హృతిక్ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేసారు. ఇంటెన్స్ ఫ‌స్ట్‌లుక్ లో హృతిక్ రోష‌న్ డాషింగ్‌గా క‌నిపిస్తున్నాడు. ఆయ‌న ర‌ఫ్ అండ్ ట‌ఫ్ లుక్ అట్రాక్టివ్‌గా ఉన్న‌ది. గ‌డ్డంతో క‌నిపిస్తున్న వేద న‌ల్ల క‌ళ్ల‌ద్దాల‌తో న‌ల్ల‌ని కుర్తాలో ర‌క్తంతో త‌డిసిన అతన్ని చూస్తుంటే.. ఒరిజిన‌ల్ మాదిరిగానే ఈ యాక్ష‌న్ మూవీ ఉండ‌వ‌చ్చు.

Advertisement

Vikram-vedha

Advertisement

విక్ర‌మ్ వేద ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌లో వేద పాత్ర‌ను విజ‌య్ సేతుప‌తి పోషించారు. హృతిక్‌లుక్ అత‌న్ని గుర్తుకు తెచ్చింది. కానీ హృతిక్ ఈ లుక్‌లో త‌న‌దైన స్టైల్ లో భిన్నంగా ప్ర‌త్యేకంగా క‌నిపిస్తున్నాడు. ఈ చిత్రం త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన విక్ర‌మ్‌వేధ చిత్రానికి హిందీ రీమెక్. ఒరిజిన‌ల్ విక్ర‌మ్ పాత్ర‌లో ఆర్‌.మాధ‌వ‌న్, వేద పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి క‌నిపించారు. ఒరిజిన‌ల్ ను రూపొందించిన ద‌ర్శ‌కుడు పుస్క‌ర్ గాయ‌త్రి చిత్రానికి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. చిత్రంలో విక్ర‌మ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ది. ఈరోజు హృతిక్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మూవీ మేక‌ర్స్ ఆయ‌న అభిమానుల‌కు ట్రీట్‌గా వేద‌ను ప‌రిచ‌యం చేశారు.

 

 

Visitors Are Also Reading