Home » స్టూడెంట్స్ పాకెట్ మనీ ఎలా వాడాలంటే..ఈ టిప్స్ ఫాలో అయితే ఫుల్ సేవింగ్స్..!!

స్టూడెంట్స్ పాకెట్ మనీ ఎలా వాడాలంటే..ఈ టిప్స్ ఫాలో అయితే ఫుల్ సేవింగ్స్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

చాలామంది చదువుకునే విద్యార్థులకు తల్లిదండ్రులు పాకెట్ మనీ గా కొంత అమౌంట్ ఇస్తూ ఉంటారు. అలా కొంతమంది విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకుంటూ ఉంటారు. ఈ సమయంలో పేరెంట్స్ ఇచ్చిన మనీని ఏ విధంగా ఖర్చు చేయాలో తెలియక ఒకేసారి ఖర్చు చేసి తర్వాత అనేక ఇబ్బందులు పడతారు. అలా తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని ఈ టిప్స్ ఫాలో అయితే చాలా ఈజీగా ఖర్చు పెట్టవచ్చు.. అది ఎలాగో చూద్దామా..

ఖర్చులు జాబితా :
కొంతమంది తెలిసి తెలియక ఎక్కువ ఖర్చులు చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఖర్చులపై నెలరోజుల ప్రణాళికను రూపొందించండి. ఎక్కువ ఎక్కడ ఖర్చు చేస్తున్నాం, ఏమైనా తగ్గించుకునే అవకాశం ఉందా అనేది అర్థం చేసుకోండి.

Advertisement

ఇంట్లో వండుకోవాలి:
వివిధ పట్టణాల్లో ఉండేటువంటి కొంతమంది పిల్లలు రూమ్స్ లో ఉంటూ ఆహారం బయట నుంచి తెప్పించుకుని తింటారు. కానీ అలా చేయకుండా ఇంట్లోనే సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల ఆరోగ్యంతో పాటు ఖర్చులు కూడా తగ్గుతాయి.

Advertisement

షేర్ చేసుకోవడం:
మీరు స్నేహితులతో ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు మీ ఖర్చులను షేర్ చేసుకోవడం మంచిది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు రవాణా టికెట్ భోజన ఖర్చులు పూర్తిగా లెక్కించి వాటిని షేర్ చేసుకుంటే మనీ సేవ్ అవుతుంది.

అనవసర ఖర్చులు తగ్గింపు :
ఒక్కోసారి మనకు అవసరం లేని వాటిపై కూడా ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని మనం తగ్గించుకోవాలి. దీనివల్ల పాకెట్ మనీ సేవ్ అవుతుంది.
మరి కొన్ని ముఖ్య వార్తలు:

Visitors Are Also Reading