Home » నచ్చిన అబ్బాయిని అమ్మాయిని పడేయలంటే ఈ అధ్బుతమైన టిప్స్ ను పాటించండి….!

నచ్చిన అబ్బాయిని అమ్మాయిని పడేయలంటే ఈ అధ్బుతమైన టిప్స్ ను పాటించండి….!

by AJAY
Ad

అబ్బాయిలు షేర్ ఆటో లాంటి వాళ్లు ఒకటి పోతే 100 వస్తాయి. కానీ అమ్మాయిలు ఆర్టీసీ బస్సు లాంటివాళ్ళు ఒకటి పోతే గంటలకొద్దీ వేచిచూడాల్సిందే. ఈ డైలాగ్ సినిమాలోది అయినప్పటికీ ఇదే వాస్తవం కూడా. అందువల్లే తమకు నచ్చిన అమ్మాయిలను పడేయడం కోసం అబ్బాయిలు కష్టపడుతుంటారు. ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ ఆ ప్రేమను అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పడానికి చాలా కష్టపడతారు. నిజానికి అమ్మాయి లేదా అబ్బాయిలను పడేయాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అయితే అన్ని వేళలా ఈ టిప్స్ పనిచేయకపోవచ్చు కానీ కొన్నిసార్లు మాత్రం ఈ టిప్స్ తో సక్సెస్ అవ్వచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం…

Advertisement

పదేపదే పొగడటం మీకు నచ్చిన అమ్మాయిని లేదా అబ్బాయిని పడేయాలంటే మీరు పదే పదే వారిని పొగుడుతూ ఉండాలి. మీ డ్రెస్ చాలా బాగుంది. మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు చాలా తెలివైన వారు. ఇలా వాళ్ళను ప్రశంసలతో ముంచెత్తాలి. అప్పుడు వాళ్ళు మీకు క్లోజ్ అవుతారు.

Advertisement

వాళ్లకు నచ్చిన విధంగా ఉండటం. ప్రతి ఒక్కరికి తమ జీవిత భాగస్వామి పట్ల కొన్ని అభిరుచులు ఉంటాయి. అయితే మీరు ఇష్టపడే వారికి ఎలాంటి అభిరుచులు ఉన్నాయో ముందుగా తెలుసుకోవాలి. వారికి ఏ రంగు దుస్తులు అంటే ఇష్టం. అనేది తెలుసుకుని అలాంటి దుస్తులు వేసుకోవాలి. వారికి ఎలాంటి ఆహారం ఇష్టమో మీకు అలాంటి ఆహారమే ఇష్టమని చెబుతూ ఉండాలి. అలా ప్రతిదీ తమకు ఇష్టమైనట్టే మీకు ఇష్టమని చెప్పాలి.

నిజాయితీగా ఉండటం

మీరు ఇష్టపడే వారితో చిన్న చిన్న చిన్న అబద్దాలు మినహాయిస్తే పెద్ద అబద్ధాలు చెప్పకూడదు. మీరు చేసే ఉద్యోగం… ఆస్తిపాస్తులు ఇలాంటి వాటి విషయంలో అస్సలు అబద్ధం ఆడకూడదు. అలా చేస్తే మొదట మిమ్మల్ని ఇష్టపడినా ఆ తర్వాత ఛీ కొట్టే అవకాశం ఉంటుంది.

ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలి

మీకు ఇష్టమైన వ్యక్తితో ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల మీరు వాళ్లకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. దాంతో వారు మెల్లిమెల్లిగా మిమ్మల్ని ఇష్టపడతారు.

Visitors Are Also Reading