Home » సైలెంట్‌లో ఉన్న మొబైల్ ఎంత వెతికినా కనిపించకపోతే ఏం చేయాలి..?

సైలెంట్‌లో ఉన్న మొబైల్ ఎంత వెతికినా కనిపించకపోతే ఏం చేయాలి..?

by Mounika
Ad

 ప్రస్తుతం మొబైల్ అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన పరికరంగా మారిపోయింది. ఏ పని చేయాలన్నా కూడా ఒక్క ఫోన్ కాల్ తో పనులన్నీ చెక్కబెట్టే వారు చాలామంది ఉన్నారు. కానీ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ ని సైలెంట్ మోడ్ లో పెడుతూ ఉంటాము. లేకపోతే మనకు తెలియకుండా కొన్ని పరిస్థితుల్లో మొబైల్ సైలెంట్ మోడ్లో పడిపోతుంది. ఒక్కోసారి పని హడావిడిలో  మొబైల్ ని ఎక్కడో చోట పెట్టి మర్చిపోతాం.

Advertisement

అంతేకాకుండా సోఫా క్రింద, బట్టల మధ్యలో పడిపోవచ్చు. గంటలకొద్దీ వెతికినా ఫోన్ దొరకదు. ఆ సమయంలో ఇల్లు పీకి పందిరి వేసేస్తాం. అలాంటి టైం లో సైలెంట్ మోడ్ లో ఉన్న ఫోన్ ని గుర్తించడం చాలా కష్టం అవుతుంది. ఇలా మనలో చాలామంది ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు.  ఇలాంటి పరిస్థితుల్లో సైలెంట్ మోడ్ లో ఉన్న ఫోన్ ఎలా కనుక్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దీని కోసం మీ ఇంట్లో వైఫై లేదా 3జి డేటా ఉపయోగించే ఫోన్ ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయగలిగితే మీ ఫోన్ కనుక్కోవడం చాలా సులువు అవుతుంది. ఇక మీ మొబైల్ ని  కనుక్కోవడానికి మరో ఆప్షన్ ఏంటంటే..  గూగుల్ ఓపెన్ చేసి ఫైండ్ మై ఫోన్ అని సెర్చ్ చేయండి.  మీరు కనుక మీ ఫోన్లో గూగుల్ ఖాతా వివరాలతో లాగిన్ అయివుంటే  చిన్న మ్యాప్‌తో పేజీలో చిన్న ఫ్రేమ్ కనిపిస్తుంది. అది మీ మొబైల్ ఎక్కడ ఉందో లొకేషన్‌ని నిర్ధారిస్తుంది. అంతేకాదు మీ మొబైల్ కి  రిమోట్‌గా రింగ్ చేసే అవకాశం ఇస్తుంది.

Advertisement

రింగ్ బటన్‌పై క్లిక్ చేసిన వేంటనే మీరు సైలెంట్‌లో ఉంచిన మొబైల్ 5 నిముషాలు పాటు ఫుల్ వాల్యూమ్‌తో రింగ్ అవుతుంది. మీరు మొబైల్ ని గుర్తించిన వెంటనే  రింగ్ ఆపడానికి పవర్ బటన్ నొక్కాలి. అంతేకాకుండా   సైలెంట్ మోడ్‌లో ఉన్న  ఫోన్ రింగ్ అవ్వడానికి అనేక యాప్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దానికోసం  యాప్ లను ముందుగానే మీ ఫోన్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి.  మీ మొబైల్ లో  డౌన్ లోడ్ చేసిన ఆ యాప్  సెట్టింగ్స్‌లో వాటిని కనెక్ట్ చేసుకోవాలి. వాటిని ఉపయోగించి  సైలెంట్‌లో ఉన్న మీ ఫోన్‌ను ఈజీగా కనిపెట్టగలం. ఈ యాప్స్ సెట్టింగ్స్ చేసుకోవడం ద్వారా మీ మొబైల్ దొంగలిచ్చినప్పుడు కూడా బాగా ఉపయోగపడతాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

ఈసారి దసరాకు ట్రయాంగిల్ ఫైట్.. బాలయ్య విజయం సాధించేనా ? 

బంగారం ఉన్నా.. కాళ్ళకు వెండి పట్టీలు మాత్రమే ఎందుకు ధరిస్తారు ?

 

 

 

Visitors Are Also Reading