Home » జలుబు లేదా ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ ని గుర్తించడం ఎలా ? వీటికి తేడా ఏంటి..?

జలుబు లేదా ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ ని గుర్తించడం ఎలా ? వీటికి తేడా ఏంటి..?

by Anji
Ad

కరోనా మహమ్మారి దాదాపు నాలుగు ఏళ్ల నుంచి వెంటాడుతూనే ఉంది. దీని వల్ల ఎంతో మంది తిరిగిరాని లోకాలకు వెళ్లారు. చాలా కుటుంబాలు చిన్నాభిన్నంగా మారాయి. మరోసారి కరోనా సబ్ వేరియంట్ అయినటువంటి ఒమిక్రాన్ బీఎఫ్ 7 ప్రపంచ వ్యాప్తంగా భయబ్రాంతులకు గురి చేస్తుంది. చైనాతో సహా పలు దేశాలలో ఈ వేరియంట్ వెంటాడుతుంది. అయితే ఈ వ్యాధి మీకు సోకిందా లేదా అనేది ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

భారత్ లో ఒమిక్రాన్ బీఎఫ్ 7 కేసులు పెరుగుతున్నాయి. అసలే చలికాలం కావడంతో సాధారణంగా ఫ్లూ లేదా కరోనా వైరస్ సోకిందా అనే అనుమానాలు వ్యక్తమవుతుంటాయి. ఈ విషయాన్ని తెలుసుకోలేక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. దాదాపు ఈ రెండింటి లక్షణాలు ఒకేవిధంగా ఉంటాయి. బీఎఫ్ 7 అనేది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కావడంతో.. దీని లక్షణాలు కూాడా ఒమిక్రాన్ లక్షణాల మాదిరిగానే జలుబు, దగ్గు, ముక్కు కారడం, జ్వరం, గొంతులో గరగర వంటివి కనిపిస్తాయి. శీతాకాలం కావడంతో జలుబు, దగ్గు వంటి లక్షణాలు చలికారణంగా వచ్చాయా.. లేక ఒమిక్రాన్ కారణంగా వచ్చాయా అనేది మాత్రం తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ఈ వేరియంట సోకినా పరిస్థితి విషమం కావడం లేదని స్పష్టమవుతోంది. జలుబు వచ్చిన వారు జాగ్రత్తగా ఉండడం బెటర్. 

Advertisement

Also Read :  సిఎం జగన్ హెల్త్ సీక్రెట్ ఇదే..ప్రతి రోజూ ఆయన తినే ఫుడ్ లిస్ట్ ఇదే !

ఒమిక్రాన్ బీఎఫ్ 7 లక్షణాలు :

ఒమిక్రాన్ బీఎఫ్ 7 లక్షణాలను పరిశీలించినట్టయితే గొంతు పాడవ్వడం, జ్వరం, ముక్కు కారడం,దగ్గు, అలసట, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, శ్వాస కష్టంగా ఉండడం వంటి లక్షణాలు ఉన్నాయి. వైద్యులు చెప్పిన ప్రకారం.. జ్వరం, దగ్గు, వంటి లక్షణాలు 5 రోజుల తరువాత తగ్గకపోతే కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. కొన్ని లక్షణాలు సాధారణ జలుబు మాదిరిగానే అయోమయానికి గురి చేస్తున్నాయి.  

Also Read :  Kirrak RP : నెల్లూరు చేపల పులుసును నెలరోజుల్లోనే బంద్ చేసిన జబర్దస్త్ కమెడియన్..

Visitors Are Also Reading